వాతావరణ చల్లాగా ఉన్నప్పుడు మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని వేడివేడిగా తింటుంటే ఆ మజానే వేరు. ఇవి రుచిగా ఉండటమే కాదు, ఎన్నో పోషకాలనూ అందిస్తాయి
TV9 Telugu
మొక్కజొన్న గింజల్లో నీటిలో కరగని పీచు బోలెడంత ఉంటుంది. అందువల్ల ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలుస్తుంది. మొక్కజొన్న కాల్చుకొని, ఉడికించి, పచ్చిగా ఎలాగైనా తినొచ్చు
TV9 Telugu
మొక్కజొన్నలో కరగని పీచు దండిగా ఉండటం వల్ల మలం ఏర్పడేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. గింజల లోపలి పలుకుల్లో ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు, పీచు ఉంటాయి. వీటిని శరీరం బాగా జీర్ణం చేసుకుంటుంది
TV9 Telugu
కానీ సెల్యులోజ్‌తో కూడిన వెలుపలి గట్టి భాగం జీర్ణం కాదు. ఇది పేగుల్లో పులిసిపోతుంది. అందుకే మొక్కజొన్న గింజలను ఎక్కువగా తిన్నప్పుడు పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంటుంది
TV9 Telugu
మొక్కజొన్నలోని ఈ పీచు ప్రిబయాటిక్‌గా పనిచేసి పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎదగటానికి తోడ్పడుతుంది. పేగుల్లోని బ్యాక్టీరియా మొక్కజొన్నను షార్ట్ చెయిన్ కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. ఇవి పెద్దపేగు క్యాన్సర్ ముప్పునూ తగ్గిస్తాయి
TV9 Telugu
మొక్కజొన్నలో మంచి మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లతో పాటు బి6, పొటాషియం, ఫోలేట్, జింక్, కాపర్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
మొక్కజొన్న వేడి స్వభావం కలిగిన ధాన్యం. అందువల్ల వీటిని శీతాకాలంలో తింటే శరీరం వెచ్చగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అయితే మొక్కజొన్నతో చేసిన పాప్‌కార్న్ ఎక్కువగా తింటే, పిల్లలకు దగ్గు వస్తుందని నిపుణులు చెబుతారు
TV9 Telugu
మొక్కజొన్నలో జియాక్సంతిన్, లుటిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కళ్ళకు ప్రయోజనకరంగా ఉంటాయి. మొక్కజొన్న ఎముకలు, కండరాలను కూడా బలపరుస్తుంది. బరువు నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది