తియ్యటి కాయగూరలతోనే కాదు.. చప్పటి గింజలతోనూ రుచికరమైన వంటకాలు చేయొచ్చని సోయా ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటుంది. వీటితో ఆరోగ్యాన్నీ, అద్భుత రుచినీ రెండూ కూడా సొంతం చేసుకోవచ్చు
TV9 Telugu
ప్రోటీన్ మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. దీనితో పాటు ఇది కండరాలు, ఎముకలు, వెంట్రుకల అభివృద్ధి, మరమ్మత్తుకు సహాయపడుతుంది
TV9 Telugu
సాధారణంగా ప్రోటీన్ మాంసాహారాల్లో అధికంగా ఉంటుంది. ఇక శాఖాహార ఆహారాల గురించి మాట్లాడుకుంటే ఔషధాల గని, పోషకాల నిధి అయిన సోయాలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది
TV9 Telugu
100 గ్రాముల సోయాలో దాదాపు 42 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని, ఇది మినపప్పు, పెసలులో ఉండే దానికంటే కంటే ఎక్కువ అని నిపుణులు అన్నారు
TV9 Telugu
సోయాబీన్స్‌ను 2 నుండి 3 గంటలు నానబెట్టి, ఆపై తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సోయాబీన్ పిండి, పాలు, సోయాబీన్ నూనె, సోయా సాస్, టోఫు వంటివి సోయా నుంచే తయారవుతాయి
TV9 Telugu
ఇందులో మంచి మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆహారంలో సోయాను పలు విధాలుగా చేర్చుకోవచ్చన్నమాట
TV9 Telugu
కూరగాయల్లోనూ సోయా వాడవచ్చు. చాలా మంది వీటితో రకరకాల వంటలు తయారు చేస్తారు. దీనిని పులావులోనూ చేర్చవచ్చు. అలాగే సోయా పాలు కూడా తీసుకోవచ్చు
TV9 Telugu
కానీ పరిమిత పరిమాణంలో మాత్రమే సోయా ఉత్పత్తులను తీసుకోవాలి. దీనితో పాటు, బీన్స్, పప్పుధాన్యాలు, గింజలు, విత్తనాలు, ఓట్స్, క్వినోవా.. వీటిల్లోనూ ప్రోటీన్ మంచి మొత్తంలో ఉంటుంది. వీటిని వివిధ మార్గాల్లో ఆహారంలో చేర్చవచ్చు