Jujube 1

చలికాలంలో వచ్చే రేగి పండ్లు తింటే కలుగుతాయ్‌ భోగభాగ్యాలు!

30 January 2025

image

TV9 Telugu

ఎర్రెర్రగా.. చిన్నచిన్నగా.. ఉండే రేగుపండ్లు ఎంత ఆకర్షణీయమో అంత ఆరోగ్యదాయకం. వీటితో రోటి పచ్చడి నూరొచ్చు, ఊరగాయ పెట్టొచ్చు. వడలు, కేక్స్‌.. ఇలా నోరూరించే వంటకాలెన్నో చేయొచ్చు

TV9 Telugu

ఎర్రెర్రగా.. చిన్నచిన్నగా.. ఉండే రేగుపండ్లు ఎంత ఆకర్షణీయమో అంత ఆరోగ్యదాయకం. వీటితో రోటి పచ్చడి నూరొచ్చు, ఊరగాయ పెట్టొచ్చు. వడలు, కేక్స్‌.. ఇలా నోరూరించే వంటకాలెన్నో చేయొచ్చు

తీపీ పులుపూ వగరూ కలగలిసిన రుచితో ఉండే రేగుపండ్లు అంటే అందరికీ ఇష్టమే. కానీ సీజన్‌లో బండ్లనిండా వచ్చే ఈ పండ్లకోసం ఆ తరవాత ఎంత వెతికినా కనిపించవు. అందుకే ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరాల్లానే ఎండిన రేగుపండ్లూ వస్తున్నాయిప్పుడు

ఒకప్పుడు కొండకొనల్లోనూ డొంకల్లోనూ పెరిగే చెట్లకు కాసే ఎర్రని రేగుపండ్లనే కోసుకొచ్చి అమ్మేవారు. వాటిల్లోనే పెద్దవీ చిన్నవీ రకాలు ఉండేవి. ఇప్పుడు వీటిని కూడా రైతులు పండిస్తున్నారు

TV9 Telugu

ఒకప్పుడు కొండకొనల్లోనూ డొంకల్లోనూ పెరిగే చెట్లకు కాసే ఎర్రని రేగుపండ్లనే కోసుకొచ్చి అమ్మేవారు. వాటిల్లోనే పెద్దవీ చిన్నవీ రకాలు ఉండేవి. ఇప్పుడు వీటిని కూడా రైతులు పండిస్తున్నారు

TV9 Telugu

అందుకే చలికాలంలో మాత్రమే వచ్చే రేగిపండ్లు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. పైగా చాలా మంది వీటిని తినడానికి తెగ ఇష్టపడతారు. ఈ పండ్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

TV9 Telugu

రేగి పండ్లలో ప్రొటీన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి

TV9 Telugu

నారింజ కంటే రేగి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇది గుండెకు ప్రయోజనకరంగా కూడా పరిగణించబడుతుంది

TV9 Telugu

విటమిన్ సి అధికంగా ఉండే రేగి పండ్లను చలికాలంలో రోజూ రెండు తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి రేగి పండ్లను తినవచ్చు

TV9 Telugu

రేగి పండ్లలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వయస్సుతో పాటు ముఖంపై వచ్చే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి