గంజిలో చద్దన్నం వేసుకుని తింటే.. సర్వరోగాలు మటాష్‌!

19 June 2025

TV9 Telugu

TV9 Telugu

రాత్రిపూట మిగిలిన అన్నంలో నీళ్లు పోసో లేదా పాలు పోసి తోడు పెట్టో చద్దన్నం చేసుకోవటం గ్రామాల్లో సర్వసాధారణం. మర్నాడు ఉల్లిపాయో, పచ్చిమిర్చో నంజుకొని తింటే అల్పాహారం పూర్తవుతుంది

TV9 Telugu

మిగిలిన అన్నాన్ని చాలామంది మర్నాడు పోపన్నంగా చేసుకొని తినటమూ తెలిసిందే. పోపులో పల్లీలు, సెనగల వంటివి చేర్చితే ప్రొటీన్‌ కూడా లభిస్తుంది. రాత్రి చపాతీలను ఉదయం తిరిగి వేడి చేసో లేదూ టీ, కాఫీ, పాలలో ముంచుకునో తింటుంటాం

TV9 Telugu

అలాగే చద్దన్నం తినడం ఏ మాత్రం చునకనగా చూడొద్దు. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్స్‌ దండిగా ఉంటాయట

TV9 Telugu

గంజిలో పులియబెట్టిన ఆహారం తింటే జీర్ణ సమస్యలన్నీ మాయమై బొజ్జకు చల్లదనాన్ని అందిస్తుంది. వేసవిలోనే కాదు అన్ని కాలాల్లోనూ ఉత్తమమైన ఆహారం ఇది

TV9 Telugu

శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని తీరుస్తుంది. కడుపును చల్లబరుస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గంజి, అన్నం రెండింటిలోనూ ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి

TV9 Telugu

దీని కారణంగా ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చద్దన్నం, గంజి తాగడం వల్ల వేసవి కాలంలో కడుపు చికాకు సమస్యలు తగ్గుతాయి

TV9 Telugu

ఇందులో లభించే కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్, ఎలక్ట్రోలైట్లు వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందించడానికి పనిచేస్తాయి. ఇది ఆహారం వృథా కాకుండా చూసుకోవటానికే కాదు, ఆరోగ్యానికీ మేలు చేస్తుంది

TV9 Telugu

పేగులు ఆరోగ్యంగా ఉండటానికి, రక్తంలో గ్లూకోజు మోతాదుల నియంత్రణకు, చివరికి బరువు తగ్గటానికీ తోడ్పడుతుంది. ఇది శరీరం ఇన్సులిన్‌కు స్పందించే సామర్థ్యాన్నీ పెంచుతుంది. దీంతో కణాలు గ్లూకోజును బాగా సంగ్రహిస్తాయి