పచ్చపెసలను ఈ పప్పుతో కలిపి తిన్నారో మీ కిడ్నీలు షెడ్డుకే.. బీ కేర్‌ ఫుల్!

19 December 2024

TV9 Telugu

TV9 Telugu

శనగలు, కందులైతే అరుగుదల కొంచెం కష్టం కానీ పెసలు అలా కాదు. తేలిగ్గా జీర్ణమవుతాయి. మన తెలుగువాళ్లకి ఇష్టమైన టిఫిన్లలో పెసరట్టు ముందుంటుంది

TV9 Telugu

నానబెట్టి మొలకలొచ్చాక తిన్నా రుచిగానే ఉంటాయి. పెసలెంతో శ్రేష్ఠం అంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే- వీటిల్లో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

పెసలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయి క్రమబద్ధంగా ఉండేందుకు తోడ్పడతాయి. గుండె జబ్బులను రానివ్వవు. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి

TV9 Telugu

ఊపిరితిత్తులకు హానిచేసే వైరస్‌లను, యాంటీ వైరల్, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి. కురులను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలేయాన్ని సంరక్షిస్తాయి. వీటితో జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది

TV9 Telugu

ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది

TV9 Telugu

అందుకే పెసలు తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ పప్పులోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఎముకలను దృఢంగా చేస్తాయి

TV9 Telugu

పెసర పప్పులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. తద్వారా అంటువ్యాధులు, వ్యాధులను రాకుండా నివారిస్తాయి. అయితే పెసలను కొన్ని రకాల పప్పులతో అస్సలు కలిపి తినకూడదట

TV9 Telugu

ముఖ్యంగా కందిపప్పుతో కలిపి తినకూడదు. దీని వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. ఈ రెండింటిలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. దీని వినియోగం మూత్రపిండాల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా కిడ్నీ రోగులు ఈ రెండు పప్పులకు దూరంగా ఉండాలి