మీరూ పండ్లు తింటున్నారా?.. ఒక్క క్షణం ఆగండి

19 October 2025

TV9 Telugu

TV9 Telugu

ఎర్రగా... పచ్చగా.. నారింజ రంగులో ఉన్న తాజా పండ్లన్నీ చూడచక్కగా.. నవనవలాడుతున్న వీటిని చూడగానే ఎవరికైనా ఇట్టే తినాలనిపిస్తుంది

TV9 Telugu

మీకూ అలాగే ఉందా! అయితే ఒక్క క్షణం ఆగాల్సిందే. ఎందుకంటే మీ కళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నాయి

TV9 Telugu

మీరు పండ్లు తింటున్నారా? కాస్త ఆగండి.. తినే ముందు వాటిని జాగ్రత్తగా పరిశీలించండి.. ఎందుకంటే తాజా పండ్లపై 'ఫ్రూట్‌ ఫ్లై' అనే సూక్ష్మకీటకాలు వాలి పండ్లను తినేస్తున్నాయి

TV9 Telugu

ఆ తర్వాత మనం తింటే అనారోగ్యం బారిన పడతామని పరిశోధకులు చెబుతున్నారు. ఉస్మానియ యూనివర్సిటీ  జంతు శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డా.నాగేశ్వరరావు ఈ హెచ్చరిలు జారీ చేస్తున్నారు

TV9 Telugu

మానవుల ఆరోగ్యంపై సూక్ష్మ కీటకాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆయన తన ప్రయోగాల ద్వారా నిరూపించారు

TV9 Telugu

సూక్ష్మకీటకాలు అరటిపండ్లు, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష పండ్లపై వాలి రంధ్రాలు చేసి అందులోని పిండి పదార్థాలు, సుక్రోజ్‌లను తింటాయి

TV9 Telugu

వాటిని మనం తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. కొంతమందికి కడుపులో నొప్పి వస్తుంది. చిన్నారులు, వయోధికులకు వాంతులు, విరోచనాలతో పాటు అజీర్తి సమస్యలూ వస్తాయి

TV9 Telugu

ఈ కీటకాలు గుంపుగా ఉన్నప్పుడే కంటికి కనిపిస్తాయి. పండ్లను మనం తినాలనుకుంటే సూక్ష్మకీటకాలు వాలిన ప్రాంతమంతా తీసెయ్యాలి. లేదా మరోసారి శుభ్రంగా కడిగి తినాలి’ అని ఆయన సూచిస్తున్నారు