రెండో పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన మీన.. వివాహనికి సిద్ధమైనట్లేనా?

16 october 2025

Samatha

అందాల ముద్దుగుమ్మ సీనియర్ స్టార్ హీరోయిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. ఒక ప్పుడు వరసగా స్టార్ హీరోలతో జతకట్టి, తన నటన, అందంతో అందరి మనసు దోచేసింది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి , సూపర్ హిట్స్ అందుకుంది. తర్వాత తెలుగు వెండితెరపైకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తర్వాత వివాహం చేసుకొని కొన్ని రోజుల వరకు సిల్వర్ స్క్రీన్‌కు దూరమైన ఈ ముద్దుగుమ్మ మళ్లీ దృశ్యం సినిమాతో తెలుగు వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈ మూవీలో ఈ అమ్మడు తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఇక కొన్ని రోజుల తర్వాత ఈ ముద్దుగుమ్మ భర్త మరణించారు. అప్పటి నుంచి ఈ బ్యూటీపై అనేక వార్తలు వస్తున్నాయి.

త్వరలో మీన రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ అనేక రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన పెళ్లిపై మనసులో మాటను ఓ షోలో బయటపెట్టింది.

ఆమె మాట్లాడుతూ నాకు రెండో పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన లేదు. కానీ ఒక వేళ నాకు నిజంగా తోడు కావాలి అని అనిపిస్తే తప్పకుండా అందరికీ చెప్పే రెండో వివాహం చేసుకుంటానంటూ మనసులో మాట బయటపెట్టింది.

ఇక ఈ బ్యూటీ గురించి నిత్యం పెళ్లి వార్తలు నెట్టింట్లో హల్ చల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ న్యూస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.