మామిడి, లిచీ.. ఈ రెండు రకాల పండ్లకు వేసవిలో అత్యధిక డిమాండ్ ఉంటుంది. కానీ చాలా మంది అధిక కేలరీల భయంతో ఈ రెండు పండ్లను తినడం మానేస్తుంటారు
TV9 Telugu
చాలా మంది రక్తంలో చక్కెర సమస్యలు పెరుగుతాయన్న భయంతో డయాబెటిస్ రోగులు మామిడి, లీచీ పండ్లు తినకూడదని భావిస్తుంటారు. వీటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది
TV9 Telugu
బరువు తగ్గడానికి కఠినమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ, ఈ రెండు పండ్లను తినడానికి మాత్రం వెనకాడుతుంటారు. అయితే నిజానికి మామిడి, లీచీలలో అసలెన్ని క్యాలరీలు ఉంటాయో తెలుసా?
TV9 Telugu
100 గ్రాముల మామిడిలో 60 కేలరీలు, లిచీలో 66 కేలరీలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అంటే మామిడిలో లీచీ కంటే కొంచెం తక్కువ కేలరీలు ఉంటాయన్నమాట
TV9 Telugu
లిచీలో 15.2 గ్రాముల చక్కెర ఉంటుంది. మామిడిలో 13.7 గ్రాముల చక్కెర ఉంటుంది. సహజంగానే లిచీలో మామిడి కంటే కొంచెం ఎక్కువ చక్కెర ఉంటుంది. అందుకే అది రుచికి తియ్యగా ఉంటుంది
TV9 Telugu
అయితే మామిడి పరిమాణం లిచీ కంటే చాలా పెద్దది. కాబట్టి మీరు లీచీకి బదులు మామిడి తింటే.. సహజంగా లిచీ కంటే చాలా ఎక్కువ మొత్తంలో తిన్నట్లు అవుతుంది
TV9 Telugu
దీంతో చక్కెర, కేలరీల తీసుకోవడం ఎక్కువవుతుంది. ఇక లిచీలో 82 శాతం నీరు ఉంటుంది. మామిడిలో 83 శాతం నీరు ఉంటుంది. రెండు పండ్లలోనూ సహజ నీటి శాతం ఉంటుంది
TV9 Telugu
మామిడిలో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే 100 గ్రాముల లిచీలో 1.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే రెండూ ఆరోగ్యానికి మంచివేగానీ మితంగా తినడం బెటర్