కాఫీ.. తాగిన 10 నిమిషాల తర్వాత నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

27 November 2025

TV9 Telugu

TV9 Telugu

కప్పు కాఫీ తాగనిదే చాలామందికి రోజు మొదలు కాదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. బద్ధకాన్ని వదిలించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి.. కాఫీని ఆశ్రయిస్తుంటారు

TV9 Telugu

అయితే కాఫీ తాగడానికి ఓ పద్ధతి పాటించాలని నిపుణులు అంటున్నారు. కాఫీ తయారీకి నాణ్యమైన గింజలనే ఉపయోగించాలి. రసాయనాలతో మిళితమైన కాఫీ బీన్స్‌ను వాడడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది

TV9 Telugu

కాబట్టి కాఫీ తాగిన పది నిమిషాల్లోపు కాసిన్ని మంచి నీళ్లు తాగడం వల్ల ఈ దుష్ర్పభావం నుంచి బయటపడవచ్చు. స్పైసీ, ఫ్రైడ్‌ ఫుడ్స్ తిన్న తర్వాత కాఫీ తీసుకోకపోవడం మంచిది

TV9 Telugu

వీలైనంతవరకు సాయంత్రం, రాత్రి వేళల్లో కాఫీ తాగకపోవడమే ఉత్తమం. ఎందుకంటే కాఫీలోని కార్టిసాల్‌, అడ్రినలిన్‌ నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతాయి

TV9 Telugu

అతి వేడి పదార్థాలు, పానీయాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాఫీ విషయంలోనూ ఈ నియమం వర్తిస్తుంది. అందుకే పొగలు కక్కే కాఫీ కాకుండా కాస్త చల్లారిన తర్వాతే తీసుకోవాలి

TV9 Telugu

చాలామంది ఉరుకులు పరుగులు పెడుతూ క్షణాల్లో కాఫీ కప్పులను ఖాళీ చేస్తుంటారు. ఫలితంగా కాఫీ ప్రయోజనాలను పూర్తిగా పొందలేరు. అందుకే ప్రశాంతంగా కూర్చొని.. నెమ్మదిగా సిప్‌ చేస్తూ.. కాఫీ రుచిని ఆస్వాదించాలి

TV9 Telugu

జీర్ణక్రియ సమస్యలున్న వారు కాఫీకి దూరంగా ఉంటే మంచిది. మరీ తప్పదనుకుంటే రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి

TV9 Telugu

ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు కూడా కాఫీని దూరం పెట్టడం మేలు. ఒకవేళ కాఫీని కచ్చితంగా రుచి చూడాలనుకుంటే మాత్రం.. ఖాళీ కడుపుతో కాకుండా, ఏదైనా తిన్న తర్వాత తాగడం మంచిది