మామిడితో వీటిని తిన్నారో.. మీ కథ కైలాసానికే!

22 May 2025

TV9 Telugu

TV9 Telugu

వేసవి.. మామిడి సీజన్. పచ్చి మామిడికాయ చట్నీ, ఊరగాయ నుంచి రకరకాల తీపి మామిడికాయల రుచులు ఆహార ప్రియుల్ని మైమరిపిస్తాయి. బంగినపల్లి, తోతాపురి, లంగ్డా, బంబయ్య ఇలా రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో దర్శనమిస్తాయి. వాటి ప్రత్యేక రుచి తెగ ఆకట్టుకంటాయి

TV9 Telugu

మామిడిలో విటమిన్ సి, కాల్షియం, బి6, ఐరన్, ప్రోటీన్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. అయితే చాలా మందికి మామిడి పండ్ల కాంబినేషన్‌ తినడం అలవాటు

TV9 Telugu

కానీ కొన్ని రకాల ప్రత్యేక ఆహారాలతో మామిడి పండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని ఆరోగ్య  నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

కాకరకాయలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కాకరకాయలో పచ్చి మామిడికాయను కలిపి అస్సలు తినకూడదట. అలాగే కాకరకాయ తిన్న వెంటనే మామిడికాయ తినకపోవడమే మంచిది

TV9 Telugu

అలాగే మామిడి పండ్లు.. పరాఠాలు, పూరీలతో కూడా కలిపి తినకూడదు. స్పైసీ ఫుడ్‌తో కూడా మామిడి కలిపి తినకూడదు. ఒకవేళ తింటే అది జీర్ణం కావడం కష్టం అవుతుంది

TV9 Telugu

మామిడిపండు తిన్న వెంటనే నీరు తాగడం కూడా మానుకోవాలి. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది

TV9 Telugu

శీతల పానీయాలు ఆరోగ్యానికి మంచివి కావు. మీరు మామిడికాయ తిన్నట్లయితే, వెంటనే శీతల పానీయాలు తాగకూడదు. లేకుంటే గుండెల్లో మంట, కడుపు నొప్పి, ఉబ్బరం కలిగిస్తుంది

TV9 Telugu

మీరు చాలా ఎక్కువ మామిడి పండ్లు తిన్నట్లయితే, ఆ తర్వాత నాలుగైదు నేరేడు పండ్లు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది