మంచిది కదాని మఖానా ఎక్కువగా తినేస్తున్నారా? మీ కొంప కొల్లేరే..
09 June 2025
TV9 Telugu
TV9 Telugu
మఖానాను ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తాం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మఖానాలో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది. పైగా దీంట్లోని ప్రొటీన్లూ, పీచూ ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి
TV9 Telugu
అందుకే, బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ నట్స్‌లో ఉండే అధిక పీచు- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం, ఇతర ఉదర సంబంధ వ్యాధులు చాలావరకు తగ్గుతాయి
అయితే మీకు తెలుసా? మఖానా ఎక్కువగా తింటే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
మఖానాలో హైపోటెన్సివ్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే తక్కువ రక్తపోటుతో బాధపడేవారు మఖానాను ఎక్కువగా తింటే మరింత దారుణంగా పడిపోతుంది
TV9 Telugu
మఖానా నెయ్యి లేదా నూనెలో వేయించి తీసుకుంటే.. మఖానా గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉన్నప్పటికీ, ఇలా వేయించడం వల్ల అది పెరుగుతుంది. ఇది చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. డయాబెటిక్ రోగులు ఇలాంటి వేయించిన మఖానా తినకూడదు
TV9 Telugu
మఖానా నీటిని గ్రహిస్తుంది. మీకు విరేచనాలు లేదా కడుపు నొప్పి ఉంటే మఖానా తినకూడదు. ఈ సమయంలో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ అలెర్జీ ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి
TV9 Telugu
గ్యాస్, గుండెల్లో మంట, అపానవాయువు సమస్యలు ఉంటే వేయించిన మఖానా తినకూడదు. ఇది ఆమ్లత్వ సమస్యలను కలిగిస్తుంది. ఇందులో ప్రోటీన్, భాస్వరం ఉంటాయి. అధిక భాస్వరం మూత్రపిండాల వ్యాధికి కారణమవుతుంది. ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉంటే తినకపోవడమే మంచిది