రాత్రిళ్లు పాలల్లో ఇది చిటికెడు కలిపి తాగితే కమ్మని నిద్ర మీ సొంతం..

23 February 2025

TV9 Telugu

TV9 Telugu

జాజికాయ... చిన్నసైజు ఆపిల్‌లా ఉండే జాజిఫలంలోని గట్టి విత్తనం. జాజికాయ మట్టి రుచితో కూడిన ఘాటైన తీపి వాసనతో ఉంటుంది. సుగంధ ద్రవ్యాలతో ముఖ్యమైనదిగా భావించే జాజికాయ చాలా ఇళ్లలోని వంటకాలలో ఉపయోగిస్తుంటారు

TV9 Telugu

రకరకాల డెజర్ట్‌లు, కారంగా ఉండే ఆహార పదార్థాల రుచిని పెంచే జాజికాయలో అనేక ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. జాజికాయలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, విటమిన్ సి, సెలీనియం, బి కాంప్లెక్స్ విటమిన్లు వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి

TV9 Telugu

పసుపు పాలు గురించి చాలాసార్లు విని ఉంటారు. కానీ ప్రతిరోజూ పాలలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తాగడం వల్ల ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది

TV9 Telugu

జాజికాయ వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను అధికంగా కలిగి ఉంటుంది. కాబట్టి జాజికాయ పొడిని గోరువెచ్చని పాలలో కలిపి తాగడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

జాజికాయ చర్మానికి కూడా మేలు చేస్తుంది. పాలతో కలిపి తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, సహజంగా ప్రకాశవంతంగా మారుతుంది. జాజికాయ పొడి కలిపిన పాలు తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి కూడా మేలు జరుగుతుంది

TV9 Telugu

ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. కానీ మీరు అధిక బరువుతో ఉంటే అధిక కొవ్వు ఉన్న పాలు తాగకూడదు. పాలలో చిటికెడు జాజికాయను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది

TV9 Telugu

ఇది ఎముకలు, కండరాలకు బలాన్ని ఇస్తుంది. కీళ్ల నొప్పులలో ఉపశమనం ఇస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇన్ని లాభాలు ఉన్నా జాజాకాయలను మితంగా తీసుకోవాలి. జాజికాయ పొడిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల భ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందట