పుల్లని కబుర్లు.. నిమ్మని ఇలా ఎప్పుడైనా వాడారా?

14 September 2025

TV9 Telugu

TV9 Telugu

తేనెలో కలిపి తాగితే ఆరోగ్యం... పులిహోరలో వాడితే మంచి రుచి... తెలిసిందిగా దేని గురించో? అవును నిమ్మ గురించే... ఆరోగ్యానికి రక్షణగా నిలిచే నిమ్మ.. ప్రకృతి అందించిన ఓ వరం..

TV9 Telugu

కాయలతో పచ్చళ్లు కూడా పెట్టుకుంటారు. ఇంకా రకరకాల వంటల్లో దీన్ని వాడేస్తుంటారు. వేసవిలో నిమ్మ కాయరసాన్ని తాగడమంటే చాలా మందికి ఇష్టం

TV9 Telugu

సి విటమిన్‌ అందించే వాటిల్లో మొదటి వరుసలో ఉండేది నిమ్మ. ఆ సంగతి అందిరికీ తెలిసిందే. దీని వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువగా అందుతుంది. అంతేకాదూ ఎ, ఇ, బీ6, విటమిన్లూ ఉంటాయి

TV9 Telugu

ఇంకా ఇనుము, రాగి, మెగ్నీషియం, క్యాల్షియం, రైబోఫ్లావిన్‌, జింక్‌ వంటివీ అందుతాయి. ఈ కాయల్ని ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు

TV9 Telugu

మనం రోజూ వాడే నిమ్మ సౌందర్య పోషణలోనూ ఎంతగానో తోడ్పడుతుంది.  వేడి నీళ్లలో కొన్ని నిమ్మ చెక్కలను వేసి పాదాలను 10, 15 నిమిషాలు ఉంచాలి

TV9 Telugu

లేదా పిండేసిన నిమ్మ డిప్పలను మడమలకు రుద్దినా ప్రయోజనం ఉంటుంది నిమ్మలోని అల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు బిరుసు చర్మాన్ని మెత్తబరుస్తాయి

TV9 Telugu

రెండు చెంచాల నిమ్మరసం, చెంచా ఆలివ్‌ నూన్‌, చెంచా సముద్రపు ఉప్పులను బాగా  కలిపి మాడుకు బాగా పట్టించాలి. పదినిమిషాలు ఆగి తలస్నానం చేయండి

TV9 Telugu

నిమ్మలోని గుణాలు కేశరంధ్రాల్లో రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఆలివ్‌ నూనె జుట్టుకు, చర్మానికి అవసరమైన తేమను ఇస్తే, సముద్రపు ఉప్పు చర్మం మీది మృతకణాల్ని తొలగిస్తుంది. దీంతో రాలడం తగ్గి, వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి