పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా.. బలంగా ఎదగాలన్నా.. పాలు తప్పనిసరి.. పాల ఉత్పత్తులు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేస్తాయి. మనిషికి సంపూర్ణమైన పోషకాలను అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించే దానిలో ఎంతో శ్రేయస్కరంగా ఉపయోగపడతాయి
TV9 Telugu
అందుకే ప్రతి ఇంట్లో పాలు, పెరుగు, మజ్జిగ ఇతర ఉత్పత్తులు తప్పనిసరిగా మారాయి. పాలు పోషకాలను అందిస్తాయి. కానీ కొంతమందికి పాలు తాగిన తర్వాత కడుపులో బరువు, గ్యాస్, తిమ్మిరి, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
ఇలా మీకు కూడా జరిగితే, మీ శరీరం పాలను జీర్ణం చేయడం లేదని సంకేతం. దీనికి కారణాలు నిపుణులు మాటల్లో తెలుసుకుందాం.. నిజానికి, పాలలో లాక్టోస్ అనే చక్కెర ఉంటుంది. దీనికి జీర్ణం కావడానికి లాక్టేజ్ ఎంజైమ్ అవసరం
TV9 Telugu
ఈ ఎంజైమ్ శరీరంలో తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయితే, లాక్టోస్ జీర్ణం కాదు. దీంతో కడుపులో గ్యాస్, బరువు, విరేచనాలు వంటి సమస్యలు మొదలవుతాయి. దీనిని లాక్టోస్ ఇన్‌టోలరెన్స్ అంటారు
TV9 Telugu
కొంతమందికి పాలలో ఉండే ప్రోటీన్ వల్ల అలెర్జీ వస్తుంది. అలెర్జీలు జీర్ణక్రియ కంటే చర్మం, శ్వాసకోశ, రోగనిరోధక వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దురద, వాపు, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి తలెత్తుతాయి. ఇది పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది
TV9 Telugu
బలహీనమైన జీర్ణవ్యవస్థ, IBS, గ్యాస్ట్రిటిస్ వంటి దీర్ఘకాలిక కడుపు వ్యాధి ఉంటే, పాలు జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల పాలు తాగిన వెంటనే బరువుగా అనిపించడం, పుల్లని బర్ప్స్, కడుపు నొప్పి వస్తుంది
TV9 Telugu
యాంటీబయాటిక్స్, అసిడిటీ మందులు, కీమోథెరపీ మందులు వంటి కొన్ని రకాల మందులు కూడా గట్ బాక్టీరియా, ఎంజైమ్ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది పాలు జీర్ణం కావడానికి ఇబ్బందిని కలిగిస్తుంది
TV9 Telugu
పాలతో ఉప్పు, పుల్లని ఆహారాలు తీసుకుంటే అది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. ప్రాసెస్ చేసిన, కల్తీ చేసిన, ప్రిజర్వేటివ్‌లను కలిగి పాలు.. సహజ పాలకు భిన్నంగా ఉంటాయి. ఇది జీర్ణం కావడంలో సమస్యలను కలిగిస్తుంది. బదులుగా సహజ పాలు తీసుకుంటే సులభంగా జీర్ణమవుతాయి