మీరూ కీరదోస రాత్రిపూట తింటున్నారా? ఐతే బండి షెడ్డుకే..

04 May 2025

TV9 Telugu

TV9 Telugu

ఒంటికి చలవ చేసే వాటిల్లో మొదటి వరుసలో ఉంటుంది కీరదోస. ఇందులో సోడియం, పీచు, కాపర్, పొటాషియం, మాంగనీస్, భాస్వరం, మెగ్నీషియం, ఎ, బి1, సి, కె విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయి

TV9 Telugu

95 శాతం నీరే ఉంటుంది కనుక డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు. కీరదోస తినడం వల్ల జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది

TV9 Telugu

కీరదోసలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది కానీ మలబద్ధకం సమస్య ఉన్నవారు దీనిని రాత్రిపూట తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

ఎందుకంటే ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కఫ దోషం పెరిగిన వ్యక్తులు రాత్రిపూట పొరపాటున కూడా కీరదోస తినకూడదు 

TV9 Telugu

అలాంటి వారు మధ్యాహ్నం సమయంలో కీరదోస తినాలి. గుర్తుంచుకోండి వీరు పొరపాటున కూడా రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన కీరదోస అస్సలు తినకూడదు. ఫలితంగా దగ్గు సమస్య పెరుగుతుంది

TV9 Telugu

అలాగే శ్వాస సమస్యలు ఉన్నవారు లేదా ఆస్తమా రోగులు రాత్రిపూట పొరపాటున కూడా కీరదోస తినకూడదు. ఎందుకంటే ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. ఉదయం సమయం కీరదోస తినడానికి ఉత్తమ సమయం. అల్పాహారానికి ముందు లేదా తర్వాత కీరదోస తినవచ్చు

TV9 Telugu

బరువును అదుపులో ఉంచుతుంది. ఒకవేళ రాత్రిపూట కీరదోస తింటే మాత్రం.. దానిని ఎల్లప్పుడూ ప్రోటీన్‌తో కలిపి తీసుకోవడం మంచిది. అంటే ఎల్లప్పుడూ అన్నం-పప్పు, రోటీతో కలిపి తీసుకోవాలన్నమాట

TV9 Telugu

తద్వారా శరీరం చల్లబడదు. సమతుల్యత కాపాడబడుతుంది. మూత్ర ఇన్ఫెక్షన్, రక్తపోటు ఉన్నవారు కూడా రాత్రిపూట కీరదోస తినకూడదు. ఎందుకంటే ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. తరచుగా బాత్రూంకు వెళ్ళవలసి వస్తుంది