మార్కెట్లో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో స్టార్ ఫ్రూట్ ఒకటి. స్టార్ ఫ్రూట్ చాలా మంది తినే ఉంటారు. వీటిలో పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి
TV9 Telugu
పచ్చి పండ్లు పచ్చ రంగులో, పుల్లగా ఉంటాయి. ఈ కాయల ఆకృతిని బట్టి వీటిని స్టార్ ఫ్రూట్ అని పిలుస్తారు. కానీ ఈ పండ్ల అసలు పేరు కానీ కారంబోలా
TV9 Telugu
వీటిని ఎక్కువగా ఉష్ణమండల దేశాలలో పండిస్తారు. ఆగ్నేయాసియా, దక్షిణ పసిఫిక్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి, బి2, బి6, బి9 విటమిన్లు, ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్, కాల్షియం, సోడియం, ఫోలేట్, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
స్టార్ ఫ్రూట్ రుచిలో తీపిగా ఉన్నా.. కేలరీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ పండ్లలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది
TV9 Telugu
ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పగుళ్లను నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఈ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం తగ్గుతుంది
TV9 Telugu
ఈ పండు తీసుకుంటే అధిక ఆహారం తినకుండా నివారించి ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా, బరువు సులువుగా తగ్గడానికి సహాయపడుతుంది
TV9 Telugu
అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు మంచి ఎంపిక. ఇవి అదనపు కొవ్వును త్వరగా తగ్గించడంలో కూడా సహాయపడతాయి. గ్యాస్, అసిడిటీ నుంచి వేగంగా ఉపశమనం అందిస్తుంది. ఇది అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. గుండెపోటులను నివారించడంలో సహాయపడుతుంది