ప్రతిరోజూ కప్పు బ్లాక్ టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
20 January 2025
TV9 Telugu
TV9 Telugu
రోజూ ఓ కప్పు బ్లాక్ టీ తాగడంవల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అంటున్నారు ఎడిత్ కొవాన్ యూనివర్సిటీ నిపుణులు. ఒకవేళ టీ అలవాటు లేనివాళ్లు అదే తాగాల్సిన అవసరం లేదు
TV9 Telugu
దానికి బదులుగా ఆపిల్, నట్స్, సిట్రస్ పండ్లు, బెర్రీల్లో ఈ ఫ్లేవనాయిడ్లు దొరుకుతాయి అంటున్నారు. ఈ విషయమై ఎనభై దాటిన ఎనిమిది వందలమందిని పరిశీలించినప్పుడు- వాళ్ల రక్తనాళాల్లో కాల్సిఫికేషన్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు
TV9 Telugu
శరీరంలోకెల్లా పొట్టలోని అవయవాలకీ కాళ్లకీ మంచి రక్తాన్ని అందించే రక్తనాళాన్ని పరిశీలించినప్పుడు- ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా తీసుకునేవాళ్లలో కాల్సిఫికేషన్ తక్కువగా ఉందట
TV9 Telugu
దీని ఆధారంగానే గుండెనొప్పి, పక్షవాతం వచ్చే సూచనల్ని గుర్తిస్తారు. అంతేకాదు, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపుని సైతం ఈ రక్తనాళం పనితీరుని బట్టి తెలుసుకోవచ్చట
TV9 Telugu
అలాగే మిల్క్ టీకి బదులు రోజూ ఒక కప్పు బ్లాక్ టీ తాగితే, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. బ్లాక్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
TV9 Telugu
బ్లాక్ టీ గుండె జబ్బులను నివారిస్తుంది. బ్లాక్ టీ గట్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది ఉబ్బరం, గ్యాస్ భారాన్ని నివారిస్తుంది. అజీర్ణం, విరేచనాల నుండి ఉపశమనం పొందడానికి, నిమ్మకాయతో బ్లాక్ టీని చేసి తాగాలి
TV9 Telugu
బ్లాక్ టీ తీసుకుంటే జీవక్రియను పెంచుతుంది. అందువల్ల ఇది ఫిట్‌నెస్‌కు మంచిది. బరువు నియంత్రణలో ఉన్నవారు బ్లాక్ టీ తాగవచ్చు. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది
TV9 Telugu
ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలానుగుణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్లాక్ టీలో కూడా కనిపిస్తాయి. దీని కారణంగా కండరాలు చురుకుగా ఉంటాయి