నిగనిగలాడే నేరేడుని చూస్తే... తినకుండా ఉండలేం. పులుపు, వగరు, తీపి కలగలిపిన రుచిలో ఉండే ఇవి... మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
మహిళల్లో కనిపించే సమస్య... రక్తహీనతను నేరేడు తగ్గించగలదట. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటంతో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సాయపడుతుంది
TV9 Telugu
హార్మోన్ల అసమతుల్యత కారణంగా కలిగే పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలపై నేరేడు సహజంగా ప్రభావం చూపిస్తుంది. వాటి హెచ్చుతగ్గులను సమం చేస్తుంది
TV9 Telugu
మెనోపాజ్ తర్వాత ఎముక బలం తగ్గుతుంది. నేరేడుని తీసుకుంటే ఇందులో పుష్కలంగా దొరికే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
TV9 Telugu
నేరేడు... గర్భధారణకు సిద్ధమవుతోన్న మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇందులో తక్కువ క్యాలరీలు ఉండటంతో పాటు ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది
TV9 Telugu
ఫలితంగా జీర్ణక్రియలు మెరుగుపడి.. అతి ఆకలి అదుపులోకి వస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. నేరేడులో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
ఆయుర్వేదం ప్రకారం పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో విటమిన్ సి, బి12, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఖనిజాలు, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే
TV9 Telugu
ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ పండ్లలోని ఐరన్ రక్త పరిమాణాన్ని పెంచుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక