గర్భం దాల్చాలనుకునే మహిళలకు ఈ పండు వరం.. 

02 July 2026

TV9 Telugu

TV9 Telugu

పనస పండు మధురమైన పరిమళంతో అందరినీ ఆహ్వానిస్తుంది. ఆ వాసన గిట్టనివాళ్లూ ఉండొచ్చు. అయితే మహిళలు తప్పక తినాల్సిన వాటిల్లో ఇదీ ఒకటి

TV9 Telugu

ఇందులోని ఎ, బి, సి విటమిన్లు, పీచు, ఇతర పోషకాలు మహిళల ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు అంటున్నారు పోషక నిపుణులు

TV9 Telugu

పనసలోని పీచు జీర్ణశక్తిని పెంచి పొట్ట ఉబ్బరం, మలబద్ధకం లేకుండా చేస్తుంది. ఈ పీచు వల్ల పొట్ట నిండినట్లుగా అనిపించడంతో బరువునీ అదుపులో ఉంచుకోవచ్చు

TV9 Telugu

పనసలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం.. వంటి ఖనిజాలన్నీ ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడతాయి

TV9 Telugu

పండిన పనసలోని పోషకాలు హార్మోన్ల సమన్వయానికీ దోహదపడతాయి. పీఎంఓఎస్‌తో బాధపడుతున్నవాళ్లకీ మెనోపాజ్‌లో ఉన్నవాళ్లకీ ఇది ఎంతో మేలు

TV9 Telugu

ఇందులోని ఫోలేట్‌ సంతానోత్పత్తి సామర్థ్యానికీ తోడ్పడుతుంది. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తోన్న మహిళలకు ఇందులోని ఫోలేట్, ఐరన్‌లు కీలకమైన పోషకాలు

TV9 Telugu

ముఖ్యంగా ఫోలేట్‌ అండం విడుదలకీ ఆరోగ్యకరమైన గర్భధారణకీ సాయపడుతుంది. అలాగే పనసలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి

TV9 Telugu

తద్వారా ప్రత్యుత్పత్తి అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ఫెక్షన్లనీ అడ్డుకుంటాయి. అయితే, అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నది మర్చిపోవద్దు