షుగర్, హై బీపీ ఉన్నవారు బొప్పాయి తినొచ్చా?

23 January 2025

TV9 Telugu

TV9 Telugu

పసిడి వర్ణంతో మెరిసిపోయే ఈ పండు ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలసటను తగ్గించడం దగ్గరి నుంచి రోగనిరోధకతను పెంచడం వరకూ ఈ పండు ప్రత్యేకతలు ఎన్నో

TV9 Telugu

బొప్పాయిలో విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, ఫోలేట్‌ మూలకాలుంటాయి. దీనిలోని విటమిన్‌-సి దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గించడంతోపాటు రోగనిరోధకతను పెంచడానికి సాయపడుతుంది

TV9 Telugu

బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో,అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.బొప్పాయి తినడం పొట్టకు ఎంతో మేలు చేస్తుంది

TV9 Telugu

ముఖ్యంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది వృద్ధాప్య సంకేతాల నుంచి రక్షణ కల్పిస్తుంది

TV9 Telugu

అయితే షుగర్, హై బీపీ సమస్య ఉన్నవారు అందరి మాదిరిగానే ఆహారాలు తీసుకోవడానికి వీలుండదు. దీంతో వీరు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటారు

TV9 Telugu

షుగర్, అధిక రక్తపోటు ఉన్నవారు బొప్పాయి తినవచ్చో లేదో ఇక్కడ తెలుసుకుందాం. మధుమేహ వ్యాధిగ్రస్తులు బొప్పాయిని తినవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు

TV9 Telugu

ఇది ఒంట్లో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటును తగ్గించడంలోనూ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

అయితే షుగర్, హై బిపి రెండూ ఉన్నట్లయితే బొప్పాయిని తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. శరీర స్వభావాన్ని బట్టి పరిమిత పరిమాణంలో తీసుకోవల్సి ఉంటుంది