వర్షాకాలంలో మీరూ అరటిపండ్లు తింటున్నారా? కాస్త ఆగండీ..

09 July 2025

TV9 Telugu

TV9 Telugu

ఏడాది పొడవునా దొరికేది, అందరికీ అందుబాటులో ఉండేది, ఎంతగానో మేలు చేసేది ఏదంటే- అది కచ్చితంగా అరటిపండే. ఈ పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు

TV9 Telugu

పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, రిబోఫ్లేవిన్‌, ఫొలేట్‌, కాపర్‌, పీచు, బి6, సి-విటమిన్లతో ఇది మంచి పోషకాహారం. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

గుండె జబ్బులను రానివ్వదు. మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ నొప్పి, వాపులను తగ్గించి.. మొత్తంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను క్రమబద్ధం చేస్తుంది

TV9 Telugu

అరటిపండులో ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలో దీనిని తినడం అంత మంచిది కాదని కొంతమంది భావిస్తుంటారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం అన్ని సీజన్లలో అరటిపండ్లు తినడం చాలా ముఖ్యం. వర్షాకాలంలోనూ అరటిపండ్లు తినకూడదనే అపోహకు ఎటువంటి ఆధారం లేదు

TV9 Telugu

అయితే వాటిని తినే సమయాన్ని కాస్త దృష్టిలో ఉంచుకోవాలని అంటున్నారు. అరటిపండ్లలో విటమిన్ సి ఉంటుంది. అందువల్ల దీనిని ఖాళీ కడుపుతో తింటే, గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది. ఏ సీజన్‌లోనైనా అరటిపండ్లను ఖాళీ కడుపుతో తినడం అంత మంచిది కాదు

TV9 Telugu

వర్షాకాలంలో చాలా మందికి జలుబు, దగ్గు వస్తాయి. అయితే తీవ్రమైన జలుబు ఉంటే మాత్రం అరటిపండ్లు తినకపోవడమే మంచిది. ఛాతీలో కఫం ఉంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది

TV9 Telugu

సాయంత్రం లేదా రాత్రిపూట అరటిపండ్లు తినకపోవడమే మంచిది. దీనివల్ల చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు