షుగర్ పేషెంట్లు రోజూ కాకర జ్యూస్‌ ఈ టైంలో తాగారంటే.. 

06 May 2025

TV9 Telugu

TV9 Telugu

కాకరకాయ పేరు చెబితే చాలు కొందరు అయిష్టంగా ముఖం పెడతారు. అందులో పంచదార వేసినా చేదుగానే ఉంటుందని దూరం పెట్టేస్తారు. కానీ కాకరలో బోల్డన్ని ఔషధ గుణాలున్నాయి

TV9 Telugu

కాకరకాయ చల్లదనాన్ని అందిస్తుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, కాల్షియం, జింక్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

ముఖ్యంగా షుగర్‌ రోగులకు కాకరకాయ ఒక వరంలా పని చేస్తుంది. కాకరకాయ తినడం వల్ల అనేక రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

TV9 Telugu

అందుకే మధుమేహ రోగులు దీనిని వివిధ మార్గాల్లో తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కాకరకాయ జ్యూస్‌ను వీరు సరైన రీతిలో తాగితే మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు 

TV9 Telugu

దీని రుచి చేదుగా ఉంటుంది. అందుకే ఇది చక్కెర స్థాయిని నిర్వహించడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ పేషెంట్లు కాకరకాయ జ్యూస్‌ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో, చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

అందుకే చాలా మంది కాకర రసం తాగుతారు. డయాబెటిక్ రోగులు ఉదయం ఖాళీ కడుపుతో కాకర రసం తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందట

TV9 Telugu

ఉదయం పూట ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే జీవక్రియ బాగుంటేనే జీర్ణక్రియను మెరుగుపడుతుంది

TV9 Telugu

కాకరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ముడతలు, మచ్చలు వంటి సమస్యలను దూరం చేస్తుంది