ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ ఇందులో పుష్కలంగా లభిస్తాయి
TV9 Telugu
అందుకే పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ ఎ; ల్యూటిన్, జియాక్సాంథిన్.. లాంటి యాంటీఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడడంతో పాటు రేచీకటి నుంచి విముక్తి కలిగిస్తాయి
TV9 Telugu
జీవక్రియలు సక్రమంగా సాగడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి కోడిగుడ్డులోని ప్రొటీన్లు తోడ్పడతాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు ఉండే కోడిగుడ్డు.. ఎముకలు, కండరాలు.. దృఢంగా తయారు కావడానికి తోడ్పడుతుంది
TV9 Telugu
ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉండే గుడ్డు ప్రతిరోజూ ఉడికించి తినడం వల్ల పోషక లోపాలను పూరించవచ్చు
TV9 Telugu
గుడ్లలో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం మంచిది
TV9 Telugu
గుడ్లలో ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో ప్రోటీన్లు అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది
TV9 Telugu
కొన్ని అధ్యయనాలు గుడ్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని వెల్లడించాయి. అయితే అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గుడ్లు పరిమితంగా తీసుకోవడం మంచిది
TV9 Telugu
గుడ్లలో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. కానీ ఎక్కువ గుడ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి