రాత్రి నిద్రకు ముందు నీళ్లు తాగే అలవాటు మీకూ ఉందా?
16 June 2025
TV9 Telugu
TV9 Telugu
రాత్రి పడుకునే ముందు సరైన పరిమాణంలో, సరైన సమయంలో నీళ్లు తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
కానీ నిద్రకు ముందు మీరు ఎక్కువ నీరు తాగితే అది నిద్ర, మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. అంటే ఈ అలవాటు మీ జీవనశైలి, హైడ్రేషన్ నమూనాపై ఆధారపడి ఉంటుందన్నమాట
TV9 Telugu
సాధారణంగా రాత్రిపూట నీళ్లు తాగడం దాదాపు అందరికీ అలవాటు. కానీ దాని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. అప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
రోజంతా తక్కువ నీరు తాగినా.. రాత్రిపూట కొంచెం నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కండరాల తిమ్మిరి, నిర్జలీకరణాన్ని నివారిస్తుంది
TV9 Telugu
కానీ ఎక్కువ నీరు తాగడం వల్ల నిద్రలో తరచుగా బాత్రూంకు వెళ్ళవలసి వస్తుంది. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా శరీరం పూర్తి విశ్రాంతి పొందలేకపోతుంది
TV9 Telugu
అందుకే రాత్రిపూట కొద్ది మొత్తంలో నీరు తాగడం మంచిది. దీనివల్ల చర్మం తేమను కాపాడుతుంది. జుట్టు పొడిబారకుండా ఉంచుతుంది
TV9 Telugu
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రాత్రంతా తరచుగా మూత్ర విసర్జన చేయవల్సి వస్తుంది. దీని వల్ల మూత్రపిండాలకు తగినంత విశ్రాంతి లభించదు. ఇది దీర్ఘకాలంలో మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు
TV9 Telugu
నిద్రపోయే 30–45 నిమిషాల ముందు అర గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం మంచిది. ఇది మీ నిద్రకు భంగం కలిగించదు లేదా శరీరం హైడ్రేషన్ లోపాన్ని అనుభవించదు