బ్రేక్ ఫాస్ట్‌కి బదులు ప్రోటీన్ షేక్స్ తీసుకుంటున్నారా?
27 October 2025
TV9 Telugu
TV9 Telugu
ప్రొటీన్ అనగానే అది కండను వృద్ధి చేస్తుందనే విషయమే గుర్తుకొస్తుంది. నిజానికి ప్రొటీన్ ప్రయోజనాల్లో ఇదొక మచ్చుతునక మాత్రమే. కండ కేవలం బలానికి, సౌందర్యానికి సంబంధించిందే కాదు
TV9 Telugu
జీవక్రియ ఉత్తేజిత కణజాలంగానూ మనల్ని కాపాడుతుంది. ప్రొటీన్ మనకు కల్పించే రక్షణకు మూలం అమైనో ఆమ్లాలు. ముఖ్యంగా ల్యూసీన్ అనే అమైనో ఆమ్లం కండర ప్రొటీన్ సంశ్లేషణ ప్రక్రియకు తోడ్పడే ఎంటార్ మార్గాన్ని ప్రేరేపిస్తుంది
TV9 Telugu
శరీర ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి నేటి కాలంలో అందరూ ప్రోటీన్ షేక్‌లు ఆశ్రయిస్తున్నారు. కానీ వాటిలో మేలు చేసే ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండవు
TV9 Telugu
ఇది ద్రవ ఆహారం కాబట్టి, ఘన ఆహారం కంటే వేగంగా జీర్ణమవుతుంది. ఫలితంగా ప్రోటీన్ షేక్ తిన్న కొద్దిసేపటికే మళ్ళీ ఆకలిగా అనిపిస్తుంది. దీనివల్ల అనారోగ్యకరమైన స్నాక్స్ అతిగా తినే ప్రమాదం ఉంది
TV9 Telugu
ప్రోటీన్ షేక్స్ మాత్రమే తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాల లోపాలు ఏర్పడతాయి. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం
TV9 Telugu
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి. అల్పాహారంలో కార్బోహైడ్రేట్లను తినకపోవడం వల్ల రోజు ప్రారంభంలో శక్తి స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు
TV9 Telugu
కొన్ని వాణిజ్య ప్రోటీన్ పౌడర్లలో కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి. ఇవి మరింత ప్రమాదకరం. బదులుగా చేపలు, మాంసం, గుడ్లు, పాలు, పప్పుధాన్యాలు వంటి ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల సహజ ప్రోటీన్ లభిస్తుంది
TV9 Telugu
పూర్తి అల్పాహారానికి ప్రత్యామ్నాయంగా కొందరు ప్రోటీన్ షేక్‌లు తినేస్తుంటారు. దీనికి బదులుగా ఓట్స్, పండ్లు, విత్తనాలు, ఆరోగ్యకరమైన కొవ్వులున్న వేరుశెనగ వెన్న తీసుకోవడం మంచిది