రాత్రి సమయంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

23 october 2025

Samatha

బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఉదయం అల్పాహారంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరానికి మేలు చేస్తుంది.

అందుకే చాలా మంది దీనిని ఎక్కువగా రాత్రి సమయంలో తినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ చాలా తక్కువ మంది బొప్పాయిని రాత్రి సమయంలో తింటారు.

బొప్పాయిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఎంజైమ్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన ఇది శరీరానికి శక్తినిస్తుంది.

బొప్పాయి జీర్ణక్రియ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే క్యాన్సర్ తగ్గిస్తుంది.

అందుకే ఎక్కువ మంది బొప్పాయి తినడానికి ఆసక్తి చూపుతారు. మరి దీనిని ఉదయం తినాలా? రాత్రి సమయంలో తినడం వలన ఏం జరుగుతుందనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.

రాత్రి సమయంలో బొప్పాయి తినడం వలన ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత బొప్పాయి తినడం వలన ఇది తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే కడుపు నొప్పిని తగ్గిస్తుంది.

బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువ. ఒక చిన్న సైజు బొప్పాయిలో కేవలం 68 కేలరీలు మాత్రమే ఉంటాయి. అందువలన దీనిని రాత్రి సమయంలో తినడం వలన త్వరగా బరువు తగ్గవచ్చును.