చపాతీ చాలా మందికి ఆహారంలో ప్రధానమైనది. వీరు రోజుకు కనీసం ఒకటి లేదా రెండుసార్లు చపాతీ తింటుంటారు. గోధుమ, జొన్నలు వంటి రకరకాల చిరుధాన్యాలతో చపాతీ తయారు చేస్తుంటారు
TV9 Telugu
అయితే అన్ని రకాల చపాతీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒంటికి శక్తిని, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు రాత్రుళ్లు అన్నం మానేసి చపాతీ తీసుకుంటూ ఉంటారు
TV9 Telugu
ఒక్క రాత్రి పూట అనే కాదు.. రోజులో ఒకసారి చపాతీ తిన్నా కూడా సమాన ఫలితం ఉంటుంది. అయితే ఎలా తయారు చేయాలో, ఎలా తినాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం
TV9 Telugu
స్టవ్ మీద నుంచి తీసిన వేడి వేడి చపాతీ తినడం అంత మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. వండిన రెండు మూడు గంటల తర్వాత దీన్ని తినాలట
TV9 Telugu
ఈ విధంగా చేయడం వల్ల మరింత వేగంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ నెమ్మదిగా ఉండే వ్యక్తులకు ఆమ్లత్వం, గ్యాస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వారు వేడి వేడిగా చపాతీ తినకపోవడమే మంచిది
TV9 Telugu
చపాతీ తయారు చేసిన 2 నుంచి 3 గంటల తర్వాత తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మృదువుగా, మరింత జీర్ణమయ్యేలా మారుతుంది. రోటీ తయారు చేయడానికి సరైన పద్ధతిని అనుసరించడం కూడా ముఖ్యం
TV9 Telugu
స్టవ్ మీద నేరుగా చపాతీ కాల్చడం ఆరోగ్యానికి చాలా హానికరం అని వైద్యులు అంటున్నారు. దీనివల్ల గ్యాస్ వంటి కడుపు సమస్యలు వస్తాయి. అలాగే పిండిని రెండు గంటల ముందుగానే కలిపి, పక్కన పెట్టుకుని, ఆ తర్వాత చపాతీ చేస్తే మెత్తగా వస్తాయి
TV9 Telugu
చపాతీలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు. వీటిల్లో ఉండే అధిక ఐరన్ స్థాయులు శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయి. తద్వారా రక్తహీనత తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు