అన్నంలోకి పచ్చడి, పప్పు, కూర.. ఇలా ఎన్ని ఉన్నా.. ఆఖరి ముద్ద పెరుగుతో తింటే ఆ రుచి, సంతృప్తే వేరప్ప. పెరుగు తినడం వల్ల ఒంటికి ఎన్ని లాభాలో తెలుసా..?
TV9 Telugu
పేగులకు ఆరోగ్యాన్నిస్తూ జీర్ణక్రియకు తోడ్పడే ప్రొబయోటిక్ బ్యాక్టీరియా పెరుగులో మెండుగా ఉంటుంది. ఇది పోషకాల గని. దీంట్లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, మినరళ్లు శరీరంలోని వివిధ జీవక్రియలను నిర్వర్తించడానికి చాలా అవసరం
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినకూడదు. ఎందుకంటే ఇది కఫ దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది
TV9 Telugu
వర్షాకాలంలో పెరుగు తినడం మానుకోవాలి. ఎందుకంటే పెరుగు చల్లగా, పుల్లగా ఉంటుంది. దీనివల్ల కఫం పెరుగుతుంది. దీంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి
TV9 Telugu
కొంతమంది పెరుగును ప్రోబయోటిక్ అని పిలుస్తారు. వర్షాకాలంలో కూడా తినడం సురక్షితమని భావిస్తారు. ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
TV9 Telugu
అయితే వర్షాకాలంలో మీరూ పెరుగు తింటుంటే మాత్రం, పరిమిత పరిమాణంలో మాత్రమే తినండి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి
TV9 Telugu
నిజానికి, వర్షాకాలంలో పెరుగు తినడం గురించి స్పష్టమైన అభిప్రాయం ఎవరికీ లేదు. కొంతమంది దీనిని తినడానికి నిరాకరిస్తారు.. మరికొందరు దీనిని సురక్షితమని భావిస్తారు