లవంగాల నీరు (క్లోవ్ వాటర్) కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపులో మంట, గట్ (జీర్ణ వ్యవస్థ) ఆరోగ్య సమస్యలకు ఇది సహజ పరిష్కారమని చాలా మంది అనుకుంటారు
TV9 Telugu
ఇది ఎంత వరకు నిజమో ఇక్కడ తెలుసుకుందాం.. లవంగాల్లో శరీరానికి ఉపయోగపడే అనేక జీవసంబంధ క్రియాశీల పదార్థాలు ఉంటాయి
TV9 Telugu
ముఖ్యంగా యూజెనాల్ అనే సమ్మేళనం లవంగాల్లో ప్రధానంగా ఉంటుంది. ఈ పదార్థానికి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి
TV9 Telugu
ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, కడుపులో ఏర్పడే అసౌకర్యాన్ని తగ్గించడంలో కొంతవరకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
కొన్ని అధ్యయనాల ప్రకారం యూజెనాల్ జీర్ణనాళంలోని మృదుకండరాలను సడలించి, ఆహారం జీర్ణక్రియ సజావుగా జరిగి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వల్ల కలిగే అసౌకర్యం కొంత తగ్గుతుంది
TV9 Telugu
ముఖ్యంగా ఒక రాత్రిలోనే కాలేయాన్ని శుభ్రపరుస్తుంది శరీరంలోని వాపులను పూర్తిగా తగ్గిస్తుంది వంటి వాదనలకు బలమైన ఆధారాలు లేవు
TV9 Telugu
గోరువెచ్చని లవంగాల నీరు తాగడం కొంతమందికి ప్రశాంతతను, సౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఏ ఒక్క సహజ పానీయాన్ని అద్భుత ఔషధంగా భావించడం సరైంది కాదు
TV9 Telugu
మంచి నిద్ర, సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణ, క్రమం తప్పని వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు లవంగాల నీరు తీసుకుంటేనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి