అవకాడో.. ఇటీవల ఎక్కడికి వెళ్లినా వినిపిస్తున్న పదం.. మార్కెట్లలో కనిపిస్తున్న పండు.. మహిళలు, పిల్లలు, ప్రధానంగా గర్భిణులు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్న ఔషధ ఫలమిది
TV9 Telugu
బట్టర్ ఫ్రూట్ (వెన్న పండు)గా పిలిచే ఇందులో ఔషధగుణాలెన్నో ఉన్నాయి. లేత పచ్చ రంగు అవకాడో గుజ్జులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, బి2, బి3, బి5, బి6, సి, ఇ, కె-విటమిన్లతోపాటు ఫోలిక్ ఆమ్లం, ఖనిజాలు... వంటి పోషకాలు పుష్కలం
TV9 Telugu
ఇవన్నీ హార్మోన్ల సమతౌల్యానికీ పీసీఓడీ, మెనోపాజ్ సమస్యల నివారణకీ సంతానోత్పత్తికీ గర్భిణుల ఆరోగ్యానికీ దోహదపడతాయి. గుండె, చర్మం, జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటారు
TV9 Telugu
అయితే అవకాడో కిడ్నీ రోగులకు హానికరం. అవకాడోలు సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఎలాంటి హానితలపెట్టవు. ఇవి శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి
TV9 Telugu
అయితే అవకాడోలు మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ముఖ్యంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) లేదా మూత్రపిండాల వైఫల్యం ఉన్నవారికి ఇవి ప్రమాదకరం
TV9 Telugu
అవకాడోలో పొటాషియం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఒక అవకాడో పండులో దాదాపు 700 నుంచి 900 మి.గ్రా పొటాషియం ఉంటుంది
TV9 Telugu
ఆరోగ్యకరమైన మూత్రపిండాలు ఈ అదనపు పొటాషియాన్ని శరీరం నుంచి ఫిల్టర్ చేయగలవు. కానీ మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో ఈ పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. దీని వలన రక్తంలో పొటాషియం పేరుకుపోతుంది. ఇది హైపర్‌కలేమియాకు దారితీస్తుంది
TV9 Telugu
ఇది గుండె లయకు అంతరాయం కలిగిస్తుంది. పరిస్థితి విషమిస్తే కొన్ని సందర్భాల్లో ఆకస్మిక మరణానికి కూడా కారణమవుతుంది. అందుకే మూత్రపిండ వ్యాధి ఉన్నవారు అవకాడో ముట్టుకోకపోవడమే మంచిది