అశ్వగంధను వీరు మర్చిపోయికూడా ముట్టుకోకూడదు! ఎందుకంటే..
11 July 2025
TV9 Telugu
TV9 Telugu
అశ్వగంధ ఆయుర్వేద మూలిక, ఇది ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రను మెరుగుపరచడానికి, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడానికి పనిచేస్తుంది
TV9 Telugu
భారతీయ జిన్‌సెంగ్‌గా పిలిచే అశ్వగంథను వేల సంవత్సరాల నుంచీ ఆయుర్వేదంలో వాడుతున్నారు. అది అద్భుతమైన ఔషధమనీ, ముఖ్యంగా స్త్రీలలో బరువు తగ్గేందుకూ ఒత్తిడిని తగ్గించేందుకూ తోడ్పడుతుంది
TV9 Telugu
దీన్ని వాడటం వల్ల శారీరకంగానూ మానసికంగానూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చనీ నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా ఆహారం ఎక్కువగా తీసుకుంటారు అనేది ఇప్పటికే అనేక పరిశీలనల్లో స్పష్టమైంది
TV9 Telugu
అయితే అశ్వగంథ వల్ల ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయనీ తద్వారా ఫుడ్ క్రేవింగ్ కూడా తగ్గడంతో బరువు అదుపులో ఉంటుందనీ తాజా పరిశోధనలూ చెబుతున్నాయి
TV9 Telugu
అశ్వగంథ ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగించినప్పటికీ కొంతమందికి మాత్రం తీవ్ర అస్వస్థతను కలిగిస్తుంది. అధిక లేదా తక్కువ రక్తపోటుకు మందులు వాడేవారు అశ్వగంధ అస్సలు తీసుకోకూడదు. ఇది మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది
TV9 Telugu
అశ్వగంధ థైరాయిడ్ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుంది. హైపర్ లేదా హైపోథైరాయిడ్ రోగులు వైద్య సలహా లేకుండా దీనిని తీసుకుంటే పరిస్థితి మరింత దిగజారవచ్చు. లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా టైప్-1 డయాబెటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు అశ్వగంధ మరింత హానికరం
TV9 Telugu
గర్భిణీలు లేదా పాలిచ్చే మహిళలు అశ్వగంధను తీసుకోకూడదు. ఎందుకంటే ఇది గర్భంలో శిశువు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లయితే, కనీసం 2 వారాల ముందు అశ్వగంధ తీసుకోవడం మానేయాలి. అనస్థీషియాతో ప్రతిచర్య జరపుతుంది
TV9 Telugu
అశ్వగంధ ఆయుర్వేదమైనప్పటికీ ప్రతి ఒక్కరి శరీరంపై దాని ప్రభావం భిన్నంగా ఉంటుంది. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యకు మందులు వాడుతున్నట్లయితే వైద్యుడి సలహా మేరకు తీసుకోవడం మంచిది