నవనవలాడే జామతో.. బోలెడంత ఆరోగ్య ధీమా!

12 July 2025

TV9 Telugu

TV9 Telugu

పచ్చగా నవనవలాడే జామ పండుని చూసి మనసు పారేసు కోనివారెవరో చెప్పండి. అయితే, ఇది రుచిలోనే కాదు... పోషకాలను శరీరానికి అందించడంలోనూ మేటే

TV9 Telugu

జామపండులో పీచు ఎక్కువ. గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. అందువల్లే మనకు అకస్మాత్తుగా చక్కెర నిల్వలు పడిపోకుండా చేసి సమతుల్యంగా ఉంచుతుంది

TV9 Telugu

అలాగే రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది. ఇందులోని ట్రైగ్లిజరాయిడ్లు చెడు కొవ్వుని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. జామలో విటమిన్‌ సి, లైకోపీన్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి

TV9 Telugu

ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఇక, ఈ పండులో ఉండే మెగ్నీషియం... శరీరం ఇతర పోషకాలను సరిగా స్వీకరించేలా చేస్తుంది

TV9 Telugu

జామ శరీరం నుంచి హానికారక ఫ్రీరాఢికల్స్‌ను బయటకు పంపి.. శరీరంలో క్యాన్సర్‌ కణాలు వృద్ధికాకుండా అడ్డుకుంటుంది

TV9 Telugu

జామ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నిరోధకంగానూ పనిచేస్తుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉండే జామపండు జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. బరువుని అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

ఇందులోని ఫోలేట్‌ సంతాన సామర్థ్యాన్ని పెంచితే,  ఫోలిక్‌ యాసిడ్‌ గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఎక్కువ పీచు, తక్కువ గ్లైసమెక్‌ ఇండెక్స్‌ ఉండే జామపళ్లు మధుమేహాన్ని పెరగకుండా చూశాయట

TV9 Telugu

దీంతో పాటు హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ ఎనిమిది శాతం పెరిగిందనీ చెబుతోంది. అధిక మోతాదులో లభించే విటమిన్‌-సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి