నానబెట్టిన ఎండుద్రాక్షను తింటే... అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో ఫైబర్ అధికం. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
TV9 Telugu
గ్లూకోజ్, ఫ్రక్టోజ్లతో శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే వ్యాయామాలకి ముందూ తర్వాతా వీటిని తింటే మేలు. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని తొలగిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అయ్యే ఒత్తిడిని తగ్గిస్తాయి
TV9 Telugu
అంతేకాకుండా, పొటాషియం రక్తపోటును అదుపు చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా పాలల్లో నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకుంటే కలిగే లాభాలు అన్నీఇన్నీకావు
TV9 Telugu
పాలలో విటమిన్ బి12, విటమిన్ డి, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు మంచి మొత్తంలో ఉంటాయి. ఇకఎండుద్రాక్షలో ఐరన్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు కూడా ఉంటాయి
TV9 Telugu
ఎండుద్రాక్షలను పాలలో నానబెట్టి లేదా ఉడకబెట్టి తినడం మహిళలకు అమృతమే. మహిళల్లో రక్తహీనత చాలా సాధారణం. పాలు, ఎండుద్రాక్షలు హిమోగ్లోబిన్‌ను అంటే ఎర్ర రక్త కణాలను పెంచుతాయి
TV9 Telugu
ఎందుకంటే ఎండుద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. B12 కూడా ఉంటుంది. ఈ పోషకాలు రక్త ఉత్పత్తికి చాలా అవసరం. 45 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళల్లో తర్వాత, ఎముకలు బలహీనపడే సమస్య మహిళల్లో కనిపిస్తుంది
TV9 Telugu
పాలలో నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. చర్మానికి కూడా మేలు జరుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది
TV9 Telugu
రోజూ పాలల్లో నానబెట్టిన 10 నుండి 15 ఎండుద్రాక్షలు తీసుకుంటుంటే మంచిది. ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే ఎండుద్రాక్ష తిరుముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది