పాలల్లో ఇది చిటికెడు వేశారంటే.. వేసవిలో కూల్‌కూల్!
05 May 2025
TV9 Telugu
TV9 Telugu
యాలకులు అనగానే సాధారణంగా మనకు ముందుగా గుర్తుకొచ్చేది స్వీట్లు. తీపిపదార్ధాలల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. మంచి సువాసనతోపాటు రుచిని రెట్టింపు చేసే యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజూ ఓ రెండు తింటే సరి. శరీరంలోని ట్యాక్సిన్లను బయటకి పంపి మూత్ర సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు నోటి బ్యాక్టీరియాను దూరం చేస్తాయి
TV9 Telugu
యాలకుల్లో విటమిన్ సి, పొటాషియం మెండుగా ఉండటం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దాంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతిమంతంగానూ మెరిసిపోతుంది
TV9 Telugu
చిగుళ్లు, దంతాల ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆకలి మందగించినప్పుడు ఈ యాలకుల్ని తీసుకోవడం వల్ల గ్యాస్ ఇబ్బందులు దరిచేరవు. అయితే మీకు తెలుసా వేసవిలో యాలకులు కలిపి పాలు తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో?
TV9 Telugu
యాలకుల్లోని శీతలీకరణ ప్రభావం వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి. తద్వారా మలబద్ధకం, ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
పాలు యాలకులు కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. యాలకులు రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి
TV9 Telugu
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాలకులు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతతాయి
TV9 Telugu
పాలను వేడి చేసేటప్పుడు అందులో 2-3 పెద్ద ఏలకులు వేయాలి. కొంతసేపు మరిగించి, ఆ తర్వాత చల్లారనిచ్చి, ఆపై ఏలకులు తీసి పాలు తాగాలి. అంతే యాలకుల పాలు రెడీ అయినట్లే