మీ పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచాలా? అయితే బీట్‌రూట్‌తో పదును పెట్టండి

24 January 2025

TV9 Telugu

TV9 Telugu

శరీరానికి కీలక పోషకాలు, ఖనిజాలు... అందించడంలో బీట్‌రూట్‌ మేటి. కానీ, దీన్ని తినడానికి మాత్రం చాలామంది ఇష్టపడరు. అందుకు కారణం దీని రుచి కాస్త వెగటుగా ఉండటమే

TV9 Telugu

ముఖ్యంగా రక్తహీనతకు ఇది బలే పనిచేస్తుంది. ఈ ముప్పుని తగ్గించుకోవాలంటే ఐరన్‌ పోషకం ఒంట్లో పుష్కలంగా ఉండాలి. అది బీట్‌ రూట్‌ నుంచి తగినంతగా అందుతుంది

TV9 Telugu

దీన్ని కూర, జ్యూస్‌, సలాడ్‌... ఇలా ఏ రూపంలో తీసుకున్నా హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. విటమిన్‌ బి, సిలు బీట్‌రూట్‌లో మెండుగా ఉంటాయి. అలాగే గుండె సంబంధిత వ్యాధులకు కూడా మేలు చేస్తుంది

TV9 Telugu

ఇవి అధిక రక్తపోటుని అదుపు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది

TV9 Telugu

అందుకే బీట్‌రూట్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి బీట్‌రూట్ బెస్ట్‌గా పని చేస్తుంది

TV9 Telugu

బీట్‌రూట్‌లోని నైట్రేట్ రక్తపోటును తగ్గిస్తుంది, ఇందులోని బ్యూటేన్ రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. మీకు మలబద్ధకం లేదా గ్యాస్ సమస్యలు ఉంటే క్రమం తప్పకుండా బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది

TV9 Telugu

బీట్‌రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మానికి చాలా మేలు చేస్తుంది. బీట్‌రూట్‌లోని ఫోలేట్, ఫైబర్ చర్మానికి మేలు చేస్తుంది. దీని రసం మొటిమలను వదిలించడంలో సహాయపడుతుంది

TV9 Telugu

బీట్‌రూట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కోలిన్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే పెద్ద పేగులో ఏర్పడిన బ్లాకేజ్‌లను తొలగిస్తాయి. బి విటమిన్లు పోషకలేమి సమస్యను అదుపు చేసి శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి