వేసవిలో చల్లచల్లగా మఖానా రైతా తింటే ఉంటుంది సామీ..
23 March 2025
TV9 Telugu
TV9 Telugu
ఫూల్‌మఖానా మంచి పోషకాహారం. బరువు తగ్గడంలోనూ తోడ్పడుతుంది. దీంతో చాలా రకాల స్నాక్స్ ట్రై చేసి ఉంటారు. మఖానాతో గుంత పొంగనాలు కూడా చేయొచ్చు
TV9 Telugu
తామర గింజలు.. ‘మఖానా’గా పిలుచుకునే ఈ గింజల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
మఖానాలో ఉండే పోషకాలు శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే చాలా మంది మఖానాను అనేక విధాలుగా తినడానికి ఇష్టపడతారు
TV9 Telugu
ముఖ్యంగా వేసవిలో చాలా మంది మఖానాతో రైతా తయారు చేసుకుని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
మఖానా రైతా రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా. దీన్ని తినడం ద్వారా శరీరానికి బోలెడన్ని పోషకాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
మఖానా రైతాలో అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో శరీరాన్ని చల్లబరచడంలో ఇది బలేగా సహాయపడుతుంది. మఖానాలో కాల్షియం, భాస్వరం ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది
TV9 Telugu
ముందుగా మఖానాలను పాన్‌లో నూనె లేకుండా కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. ఆ తర్వాత పెరుగును బాగా గిలకొట్టిన పెరుగును మఖానాల్లో వేసి కలుపుకోవాలి
TV9 Telugu
ఇందులో రుచికోసం కీరదోస ముక్కలు, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు కలిపితే సరి. మఖానా రైతా రెడీ.. వేసవి చల్లచల్లగా అప్పటికప్పుడు తయారు చేసుకుని ఆరగించవచ్చు