ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో లీచీ ముఖ్యమైనవి. రోడ్డు పక్క బండ్లపై ఎక్కడ చూసినా లిచీ పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదూ! ఎరుపు, తెలుపు మేళవింపుతో జెల్లీలా కనిపిస్తూ తెగ నోరూరిస్తాయి
TV9 Telugu
వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, వృద్ధాప్యఛాయలు త్వరగా దరిచేరకుండా కాపాడతాయి. విటమిన్-సి నల్లమచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. అందుకే స్కిన్‌కేర్ ఉత్పత్తుల్లోనూ దీనికి చోటిస్తారు
TV9 Telugu
రుచికి తియ్యగా ఉండే లిచీ పండ్లు తినడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. ఇందులో నిజమెంతో నిపుణుల మాటల్లో మీకోసం..
TV9 Telugu
నిజానికి, లిచీలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. దాని గ్లైసెమిక్ సూచిక కూడా ఎక్కువగా ఉంటుంది. లిచీ తినడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది
TV9 Telugu
అయితే డయాబెటిస్ రోగులు లిచీ అస్సలు తినకూడదని కాదు.. మితంగా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్ రోగులు లిచీ అస్సలు తినకూడదనేది నిజం కాదు
TV9 Telugu
ముఖ్యంగా రాత్రిపూట లిచీ తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. లిచీ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్ ని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి
TV9 Telugu
లిచీ తినకూడదనుకుంటే మాత్రం ఆహారంలో జామ, బొప్పాయి, కివి, బెర్రీలు వంటి ఇతర పండ్లను చేర్చుకోవచ్చు. ఇవి డయాబెటిస్‌కు సురక్షితం
TV9 Telugu
లిచీలో సహజ చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని వేగంగా పెంచుతుంది. అలాగే లిచీలో ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది. అందుకే డయాబెటిస్ రోగులు మితంగానే దీనిని ఇతీసుకోవాలి