పచ్చి ముత్యాలు.. 6 నెలలు రుచి చెడకుండా నిల్వ చేసే టెక్నిక్!
18 June 2025
TV9 Telugu
TV9 Telugu
లేతపచ్చిబఠాణీలను కూరల్లోనే కాదు సాయంకాలాల్లో స్నాక్స్‌లా తీసుకోవచ్చు. ఇతర ఎండుఫలాలతో కలిపి ఎంచక్కా లాగించేయొచ్చు. కొవ్వులు లేని ఈ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు
TV9 Telugu
100 గ్రాముల పచ్చి బఠాణీల్లో మూడొంతుల నీరే ఉంటుంది. మాంసకృత్తులు, పీచుతోపాటు ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, కాపర్, జింక్, మాంగనీస్ లాంటి ఖనిజాలూ ఎక్కువే
TV9 Telugu
పీచు దండిగా ఉండే బఠాణీలను తింటే మలబద్ధకం సమస్య ఉత్పన్నం కాదు. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
TV9 Telugu
అయితే పచ్చి బఠానీ అన్ని కాలాల్లో అందుబాటులో ఉండదు. ఒకప్పుడు శీతాకాలం ముగిసిన తర్వాత పచ్చి బఠానీ మార్కెట్‌లో అదృశ్యమయ్యేవి. అయితే ఈ ఫ్రోజెన్ గ్రీన్ బీన్స్ ఇప్పుడు ఏడాది పొడవునా అందుబాటులోకి వస్తున్నాయి
TV9 Telugu
అయితే ఇవి తాజా బీన్స్ లాగా రుచిగా ఉండవు. పైగా ఖరీదైనవి కూడా. అయితే పచ్చి బఠానీ సీజన్‌లో ఈ విధంగా నిల్వ చేస్తే ఏకంగా 6 నెలలపాటు తాజాగా, రుచి చెడకుండా ఉంటాయి. అందుకు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
పచ్చి బఠానీ తొక్కలు తీసివేసి బాగా కడిగి ఆరబెట్టాలి. వాటిని నేరుగా రిఫ్రిజిరేటర్‌లో పెడితే అవి గడ్డకడుతాయి. అదే కొన్ని నెలల పాటు నిల్వ ఉండాలంటే, గాలి లోపలికి రాని 'ఎయిర్ టైట్ కంటైనర్'లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి
TV9 Telugu
రిఫ్రిజిరేటర్‌లోని అధిక చల్లదనం కారణంగా విడుదలయ్యే అదనపు తేమను పీల్చుకోవడానికి కంటైనర్‌లో ఒక టిష్యూను ఉంచాలి. మీరు కావాలనుకుంటే దాని జిప్‌లాక్ బ్యాగ్‌లో కూడా ఓ టిష్యూను నిల్వ చేయవచ్చు
TV9 Telugu
ఈ విధంగా చేస్తే, బీన్స్‌ను 4-6 నెలలు సులభంగా నిల్వ చేయవచ్చు. మీరు వాటిని బయటకు తీసి అవసరమైనప్పుడు ఉపయోగించి మళ్ళీ నిల్వ చేసుకోవచ్చు