అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా నిల్వ చేశారంటే 6 నెలలు తాజాగా..
08 September 2025
TV9 Telugu
TV9 Telugu
ప్రతిరోజూ చేసే కూరలు, మాంసాహారాల్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ రుచే వేరబ్బ.. వంటకాలకు ప్రత్యేక రుచిని అందించడంలో దీని తర్వాతే మరేదైనా..
TV9 Telugu
అయితే ప్రతీసారి వెల్లుల్లి, అల్లం తొక్క తీసి, శుభ్రం చేసి.. మెత్తగా రుబ్బుకోవడం అంత తేలికైన పనికాదు. అందుకే కొందరు గృహిణులు ఒకేసారి చాలా అల్లం, వెల్లుల్లి అధికమొత్తంలో పేస్ట్ చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు
TV9 Telugu
అయితే సరైన పద్ధతిలో దీనిని నిల్వ చేయకపోతే, అది 3-4 రోజుల్లోనే చెడిపోతుంది. అల్లం, వెల్లుల్లి పేస్ట్ ని ఇలా నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
కానీ నేటి రోజుల్లో చాలా మంది ప్యాక్ చేసిన రసాయనాలతో నింపిన అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ని మార్కెట్లో కొనుగోలు చేసి వాడుతుంటారు. ఇది ఆహారానికి మంచి రుచిని అందించదు. పైగా ఆరోగ్యం కూడా పాడైపోతుంది
TV9 Telugu
ఇంట్లోనే ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే.. ముందుగా అల్లం, వెల్లుల్లి తొక్క తీసి మిక్సర్ గ్రైండర్ లో పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అయితే అందులో నీళ్లు అస్సలు వాడకూడదు. దానికి కొద్దిగా ఆవాల నూనె కలపవచ్చు
TV9 Telugu
ఇలా అల్లం, వెల్లుల్లిని ఆవ నూనెతో మెత్తగా చేసిన తర్వాత, దానికి ఉప్పు వేసి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు నెలల వరకు రుచి కోల్పోకుండా నిల్వ ఉంటుంది
TV9 Telugu
అలాగే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను ఐస్ క్యూబ్‌లుగా కూడా తయారు చేసి వంటలో ఉపయోగించవచ్చు. ఇది వింతగా అనిపించినా.. మీ పనిని మరింత సులభతరం చేసుకోవాలనుకుంటే అల్లం వెల్లుల్లి ఐస్ క్యూబ్స్ కూడా తయారు చేసుకోవచ్చు
TV9 Telugu
అల్లం, వెల్లుల్లిని ఉప్పు, ఆవాల నూనెతో కలిపి ఐస్ ట్రేలో నింపి డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. అవసరమైనంతవరకు ఒకటి లేదా రెండు క్యూబ్‌లను బయటకు తీసి వంటలో ఉపయోగించవచ్చు. ఇది 5 నెలల వరకు చెడిపోదు