స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై, ఇంట్లోనే ఇలా సులభంగా చేసెయ్యండి!

10 September 2025

Samatha

కాకర కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఇది స్టప్డ్ ఫ్రై చేసుకొని తింటే ఆ రుచే వేరే లెవల్ ఉంటది, కాగా , ఇంట్లోనే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు ,4 నుంచి 5 కాకర కాయలు, అల్లం1/4కప్పు, శనగపిండి 1కప్పు, 4నుంచి 5 కప్పుల నీరు, సరిపడ ఉప్పు, సోంపు గింజలు, 1 టీస్పూన్ ఎర్రకారం, ధనియాల పొడి, 2 టీస్పూన్స్ నూనె

ముందుగా కాకరకాయలు ఉప్పు వేసిన నీటిలో రెండు నిమిషాలు నానబెట్టి, తర్వాత ఆ వాటర్‌తో బాగా కడగాలి. మళ్లీ కొంచెం ఉప్పు చల్లుకోవాలి.

తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక, మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు వ వేయించుకోవాలి.

అదే విధంగా మనం ముందుగా చెప్పిన కొలతల ప్రకారం, శనగ పిండి తీసుకొని, దానిని కూడా మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

సుగంధ ద్రవ్యాలు, శనగపిండి రెండూ కలిపి ఒకసారి వేయించుకొని, పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం కడిగి పెట్టుకున్న కాకరకాయలు ను కూడా పక్కన పెట్టుకోవాలి.

కాకరకాయను మధ్య మధ్యలో ముక్కలుగా కోసి, శనగపిండి, మసాలా మిశ్రమంతో నింపాలి.తర్వాత వాటిని దారాలతో గట్టిగా కట్టాలి

 అనంతరం కాకరకాయలు మంచిగా ఉడికి క్రిస్పీగా అయ్యే వారకు మంచిగా నూనెలో వేయించుకోవాలి. తర్వాత దానిపై మసాల చల్లండి. అంతే వేడి వేడి స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెడీ