మొదటగా ఒక గిన్నెలో పులియబెట్టిన ఇడ్లీ పిండిని ముందుగానే తీసుకోవాలి. తర్వాత తరిగిన కూరగాయలన్నీ వేసి, కాస్త ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి.
ఇడ్లీపాత్ర తీసుకొని దాని అంచులకు, నూనె లేదా నెయ్యి రాసుకోవాలి. తర్వాత ప్రతి ఇడ్లీ పాత్రలోని అచ్చులలో పిండిని పోసీ, 3/4 వంతు నీరు పోయాలి.
ఆ తర్వాత ఇడ్లీ స్ట్రీమర్ లేదా ప్రెజర్ కుక్కర్‌లో మీడియం సైజు మంటపై పెట్టుకోవాలి 10 నుంచి 12 నిమిషాలు ఆవిరి మీద ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తర్వాత మూత తీసి టూత్ పిక్ తో ఇడ్లీలు ఉడికాయో లేదో చూసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే అవి శుభ్రంగా ఉడికితే ఇడ్లీ రెడీ. వేడి వేడి వెజిటేబుల్ ఇడ్లీ రెడీ అయిపోయినట్లే.
దీనిని మీరు కొబ్బరి చట్నీ లేదా సాంబర్‌తో వేడి వేడిగా వడ్డించి తీసుకుంటే ఉండే టేస్ట్ వేరే లెవల్ ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఒకసారి మీరు కూడా ఈ వెజిటేబుల్ ఇడ్లీని ట్రై చేయండి.