మహిళల్లో అధిక మంది హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతుంటారు. అధికబరువు, నెలసరి క్రమం తప్పడం... ఇలా ఎన్నో సమస్యలకు ఇదే మూలం. దీనిని అదుపులోకి తేవాలంటే రోజూ గుప్పెడు మొలకల్ని తినాలి
TV9 Telugu
పెసర్లు, రాగులూ, బొబ్బర్లు, రాజ్మా వంటివన్నీ కలిపి తీసుకుంటే విటమిన్లూ, ఖనిజాలూ, ప్రొటీన్ వంటి పోషకాలన్నింటినీ సమతులంగా శరీరానికి అందుతాయి. మొలకలు తినడం ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది
TV9 Telugu
ముఖ్యంగా శీతాకాలంలో వీటిని తప్పకుండా తినాలి. అయితే చాలా మందికి పెసర్లు లేదా బొబ్బర్లు వంటి గింజలతో మొలకలు ఏ విధంగా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం
TV9 Telugu
ముందుగా పెసర్లు లేదా శనగలు ఏవైనా గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు కాటన్ గుడ్డలో కట్టాలి. వీటిని ఓ బాక్సులో ఉంచి వెచ్చని ప్రదేశంలో ఉంచినట్లయితే అవి త్వరగా మొలకెత్తుతాయి
TV9 Telugu
అయితే శీతాకాలంలో మొలకలు సరిగ్గా మొలకెత్తలేవు. సాధారణంగా కాస్త వెచ్చని ప్రదేశంలో ఉంచినట్లయితే అవి త్వరగా మొలకెత్తుతాయి. అందువల్ల శీతాకాలంలో మొలకలు రావాలంటో ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి
TV9 Telugu
గింజలను చల్లటి నీటిలో కాకుండా వేడి నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఇది అంకురోత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తుంది. నీరు చాలా వేడిగా ఉండకూడదు. కాస్త గోరువెచ్చగా ఉండాలి. ఈ విషయం గుర్తుంచుకోండి
TV9 Telugu
త్వరగా మొలకెత్తాలంటే వాటిని వేడిగా ఉండే వంటగది వంటి వెచ్చని ప్రదేశంలో తడి గుడ్డలో చుట్టి ఉంచాలి. మూసి ఉన్న గిన్నెలో ఉంచాలి. త్వరగా మొలకలు వస్తాయి
TV9 Telugu
గింజలు మొలకెత్తుతున్నప్పుడు మొలకలు కనిపించే వరకు బాగా 2 నుండి 3 సార్లు కడగాలి. ఇలా చేస్తే పప్పులు తాజాగా ఉంటాయి. ఫంగస్ లేదా బ్యాక్టీరియా ప్రమాదం తక్కువగా ఉంటుంది