ముందుగా పుట్టగొడుగులను తీసుకుని బాగా క్లీన్ చేసి దాని మీద ఉన్న నలుపు మొత్తం పోయే వరకు కడిగి చిన్న ముక్కలుగా కోసి గిన్నెలో పెట్టుకోవాలి
స్టెప్ - 1
ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పండు టమోటాలు, ఒక అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి.
స్టెప్ - 2
ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి బాగా వేయించుకోవాలి.
స్టెప్ - 3
ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక టీ స్పూన్ మసాలా పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి.
స్టెప్ - 4
ఇక ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసిన పుట్టగొడుగులు వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి 15 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర కిందకు చల్లి దించేయాలి.