బయట కొనకండి.. ఇంట్లోనే సింపుల్‌గా బాదం పాలు ఎలా తయారు చేయాలంటే?

Samatha

8 november 2025

బాదం పాలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇవి రుచిగా ఉండటమే కాకుండా , ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లినా లేదా తాగాలనిపించినప్పుడు బయటకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు.

అయితే బాదం పాలు ఇక నుంచి బయట కొనాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే? ఇంటిలోనే చాలా సింపుల్‌గా బాదం పాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు,  ఒక కప్పు బాదం , 1 టీస్పూన్ సముద్రపు ఉప్పు, రెండు ఖర్జూరాలు, ఐదు కప్పుల నీరు, 1 టీ స్పూన్ వెనిలా .

ముందుగా ఖర్జూరాలను బాదం పప్పులను విడి విడిగా నానబెట్టాలి. తర్వాత వీటిని గ్రైండర్‌లో వేసి, ఉప్పు నీరు, పోస్తూ మిక్సీ పట్టుకోవాలి.

తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక డిష్ క్లాత్‌లోకి తీసుకొని వాటి నుంచి పాలను వేరు చేసి వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత గుజ్జును పారెయ్యాలి.

ఆ తర్వాత మనం గుజ్జు నుంచి వేరు చేసిన పాలను వేరే గాజు సీసాలో స్టోర్ చేసి, అందులో వెనీలా ఎస్సెన్స్ యాడ్ చేయాలి. అంతే బాదం పాలు రెడీ.

వీటిని మీరు ఒకటి లేదా రెండు రోజుల ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకొని, తాగాలి అంతే, బయట దొరికే వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ప్రిపేర్ చేయండి.