టమాటాలు త్వరగా కుళ్లిపోతున్నాయా.. ఇలా చేస్తే ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా  

Krishna

30 June 2026

పూర్తిగా పండని టమాటాలను కొన్న వెంటనే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల అవి పండే ప్రక్రియ ఆగిపోవడమే కాకుండా వాటి సహజమైన రుచి కూడా దెబ్బతింటుంది.

ఫ్రిజ్‌లో పెట్టకండి

టమాటాలను ఎల్లప్పుడూ వాటి కాడ కిందికి ఉండేలా బోర్లించి ఉంచాలి. కాడ పైకి ఉంటే ఆ భాగం నుండి గాలి, తేమ లోపలికి వెళ్లి టమోటాలు త్వరగా కుళ్లిపోతాయి.

 తలక్రిందులుగా

 టమాటాలను ప్లాస్టిక్ సంచులలో చుట్టి ఉంచితే లోపల తేమ పేరుకుపోయి బూజు పడుతుంది. వీటికి గాలి తగలడం చాలా ముఖ్యం.

ప్లాస్టిక్ కవర్లు 

 ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా, గాలి చక్కగా ప్రసరించేలా రంధ్రాలు ఉన్న గిన్నెలు లేదా వెడల్పాటి ఓపెన్ బుట్టలలో టమోటాలను నిల్వ చేసుకోవడం ఉత్తమం.

ఓపెన్ పాత్రలలో

పండిన టమాటాలపై నేరుగా సూర్యరశ్మి పడితే అవి మరీ మెత్తగా అయిపోయి, కుళ్లిపోతాయి. అందుకే వీటిని వంటగదిలోని చల్లని, నీడగా ఉండే ప్రదేశంలో ఉంచాలి.

ఎండ తగలకుండా

టమాటాలు సహజంగా ఇథిలీన్ అనే వాయువును విడుదల చేస్తాయి. వీటిని మిగతా కూరగాయలతో కలిపి ఉంచితే, ఆ వాయువు వల్ల పక్కన ఉన్న కూరగాయలు కూడా త్వరగా కుళ్లిపోతాయి.

ఇతర కూరగాయలకు

టమాటాలు గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా పండిన తర్వాత మాత్రమే, అవసరమైతే వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

పూర్తిగా పండాకే

టమాటాలు గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా పండిన తర్వాత మాత్రమే, అవసరమైతే వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. పూర్తిగా పండాకే

కొనేటప్పుడే జాగ్రత్త