కంటికి కనిపించేదంతా నిజంకాదు.. ఆ అరటిపండ్లు కాలకూట విషమే! జాగ్రత్త..
23 May 2025
TV9 Telugu
TV9 Telugu
పండ్లన్నీ ఆరోగ్యానికి మంచివే. కానీ అరటి పండు మాత్రమే ఆరోగ్యంతోపాటు ఆనందాన్నీ అందిస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. మృదువుగా ఉంటుంది కాబట్టి అన్నం కన్నా ముందు పసివాళ్లకు తినిపించే ఘనాహారం కూడా ఇదే
TV9 Telugu
నిజానికి రోజుకో ఆపిల్ తింటే వైద్యుడితో పని ఉండదు అంటారు కానీ, రోజుకో అరటిపండు తిన్నా చాలు, సకల రోగాల నుంచీ సంరక్షిస్తుంది. అయితే నేటి కాలంలో కల్తీ రాయుళ్లు చివరికి అరటి పండ్లను కూడా కల్తీ మయం చేస్తున్నారు
TV9 Telugu
అరటిపండు కార్బైడ్ పూత పూసి కృత్రిమంగా పండిస్తున్నారు. వీటిని కొనే ముందు ఎలా గుర్తించాలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
కార్బైడ్‌తో పండించిన అరటిపండ్ల తొక్కపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. పై తొక్క మరింత మెరుస్తూ, ఆకర్షణీయంగా ఉంటుంది. సహజంగా పండిన అరటిపండు తొక్క తేలికగా, మృదువుగా ఉంటుంది
TV9 Telugu
నీటిలో వేసినప్పుడు అది వెంటనే మునిగిపోతే అది నిజమైన అరటిపండు. అలాకాకుండా పైకి తేలుతుంటే మాత్రం నకిలీ అని అర్ధం చేసుకోవాలి
TV9 Telugu
కార్బైడ్‌తో పండించిన అరటిపండ్లు కొద్దిగా చేదుగా ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు. సహజంగా పండిన అరటిపండ్లు రుచికి తియ్యగా ఉంటాయి
TV9 Telugu
కార్బైడ్‌తో పండించిన అరటిపండ్లు లేత పసుపు రంగులో ఉంటాయి. సహజంగా పండిన అరటిపండ్లలో గోధుమ లేదా నల్లని మచ్చలు పైకి కనిపిస్తాయి
TV9 Telugu
సహజంగా పండిన అరటిపండ్లు తీపి వాసన కలిగి ఉంటాయి. కార్బైడ్‌తో పండించిన అరటిపండ్లకు సహజ సువాసన ఉండదు. కార్బైడ్ వంటి కృత్రిమ రసాయనాలతో పండించిన అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి హానికరం. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి