ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే బొప్పాయి విత్తనాలు.. ఎలా తీసుకోవాలంటే?
08 February 2025
TV9 Telugu
TV9 Telugu
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం... ఇది బొప్పాయితో లాభం. అయితే రోజులో ఎప్పుడైనా కాకుండా రోజుని బొప్పాయితోనే ప్రారంభిస్తే ఆరోగ్యానికి చాలా మేలంటున్నారు నిపుణులు
TV9 Telugu
విటమిన్ ఎ, బి, సి, ఇ, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు... లాంటి పోషకాలెన్నో ఉంటాయి బొప్పాయిలో. దీన్లో అధిక మోతాదులో ఫైబర్ ఉండటంవల్ల పరగడుపున తింటే మలబద్ధకాన్ని పోగొడుతుంది
TV9 Telugu
బొప్పాయి అజీర్తిని తగ్గిస్తుంది. పీచు పదార్థంవల్ల త్వరగా ఆకలి వేయదు. క్యాలరీలూ తక్కువ. కాబట్టి బరువుని తగ్గిస్తుంది. ఉదయాన్నే తింటే శరీరంలోని మలినాల్ని బయటకు పంపి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
TV9 Telugu
అంతేకాదు, దీన్లో పొటాషియం గుండె జబ్బుల్ని తగ్గిస్తే లైకోపీన్ చర్మానికి నిగారింపు తెస్తుంది. అందుకే రోజుని బొప్పాయితో మొదలుపెట్టండని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
అయితే బొప్పాయి పండు మాత్రమే కాదు, దాని లోపలి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందట
TV9 Telugu
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బొప్పాయి గింజలు ఉపయోగపడతాయి. అలాగే ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. బొప్పాయి గింజలు శరీరాన్ని శుభ్రపరుస్తాయి
TV9 Telugu
దీన్ని నానబెట్టి తాగడం వల్ల శరీర, కాలేయ సమస్యలు తగ్గుతాయి. బొప్పాయి గింజలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. ఈ విత్తనాలలో జీర్ణ ఎంజైములు ఉంటాయి. అవి జీర్ణక్రియను సజావుగా ఉంచుతాయి
TV9 Telugu
మలబద్ధకం వంటి తీవ్రమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బొప్పాయి విత్తనాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడంలో దివ్య ఔషధంగా పనిచేస్తాయి
TV9 Telugu
ఈ విత్తనాలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరుగుతుంది. బరువును నియంత్రించడంలో ఇది బలేగా సహాయపడుతుంది