ఈ కూల్‌డ్రింక్ తాగండి అదిరిపోద్ది....ఆ కూల్ డ్రింక్ తాగండి దుమ్మురేగిపోద్ది అంటూ కూల్‌డ్రింక్స్ యాడ్స్ ఊదరగొడతాయి. వాళ్లదేం పోయింది. పోయేదంతా తాగినోళ్లదే కదా..
TV9 Telugu
అవునండీ.. చాలా మంది కూల్ డ్రింక్స్ కేవలం కార్బోనేటేడ్ నీరు అని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఈ తీపిపానీయాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొత్తగా 22 లక్షల టైప్ 2 డయాబెటిస్ కేసులు, 12 లక్షల హృద్రోగ కేసులు చోటు చేసుకుంటున్నాయి
TV9 Telugu
తీపిపానీయాలు వేగంగా జీర్ణమవుతాయి, రక్తంలో చక్కెర స్థాయిలను అధికంగా పెంచుతాయి. కానీ పోషక విలువ తక్కువ
TV9 Telugu
వీటిని తరచూ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, కొలెస్టరాల్ పెరగడం, టైప్ 2 డయాబెటిస్, హృద్రోగాలతో సంబంధం ఉన్న జీవక్రియల్లో సమస్యలు ఏర్పడతాయి
TV9 Telugu
ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధులివే. ఈ పానీయాల వల్ల మహిళలకన్నా పురుషులు, పెద్ద వారి కన్నా యువత ఎక్కువగా దుష్ప్రభావాలకు లోనవుతున్నారు
TV9 Telugu
మార్కెట్లో లభించే చాలా సోడా పానీయాలలో కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి. ఈ పానీయాలలో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, సుక్రోజ్ వంటి అదనపు చక్కెరలు ఉంటాయి
TV9 Telugu
డైట్ సోడాలలో కూడా చక్కెరకు బదులుగా అస్పర్టమే లేదా స్టెవియా వంటి కృత్రిమ స్వీటెనర్లు ఉంటాయి. సోడా ఎక్కువగా తాగడం వల్ల బరువు, రక్తంలో చక్కెర రెండూ పెరుగుతాయి
TV9 Telugu
వీటిని తాగడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే తాజాగా తాగాలనుకుంటే సాదా సోడా లేదా నిమ్మకాయ నీరు తాగడం మంచిది