రోజూ నిమ్మరసం ఇలా తీసుకుంటే.. సన్నజాజి తీగలా మారిపోతారు!

25 February 2025

TV9 Telugu

TV9 Telugu

తేనెలో కలిపి తాగితే ఆరోగ్యం... పులిహోరలో వాడితే మంచి రుచి... అదేనండీ ఆరోగ్యానికి రక్షణగా నిలిచే నిమ్మ కాయల గురించే మనం మాట్లాడుతుంది.. నిమ్మ పచ్చళ్లు, వంటకాలు, జ్యూస్‌లు ఏ చేసినా రుచి అదరహో..

TV9 Telugu

నిమ్మకాయ ఒక సిట్రస్ పండు. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది

TV9 Telugu

సి విటమిన్‌ అందించే వాటిల్లో మొదటి వరుసలో నిమ్మ ఉంటుంది. ఆ సంగతి అందరికీ తెలిందే. దీని వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువగా అందుతుంది. అంతేకాదూ ఎ, ఇ, బీ6, విటమిన్లూ ఇందులో అధికంగా ఉంటాయి

TV9 Telugu

నిమ్మలో ఇనుము, రాగి, మెగ్నీషియం, క్యాల్షియం, రైబోఫ్లావిన్‌, జింక్‌ వంటి ఖనిజాలు అందుతాయి. నిమ్మకాయల్ని ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు

TV9 Telugu

ప్రతిరోజూ ఆహారంలో ఒక నిమ్మకాయను చేర్చుకుంటే, అది రోజువారీ విటమిన్ సి అవసరాన్ని తీర్చుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

TV9 Telugu

ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం తిన్న వెంటనే నిమ్మకాయ తింటే, అది మీ జీర్ణక్రియను వేగంగా మెరుగుపరుస్తుంది

TV9 Telugu

ఇది జీర్ణ రసాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచడానికి పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది

TV9 Telugu

నిమ్మలో పెక్టిన్ ఉంటుంది. నిమ్మరసం గోరువెచ్చని నీటితో కలిపి తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో కాలేయం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది