మీరూ మిగిలిపోయిన అన్నం ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా?
17 January 2025
TV9 Telugu
TV9 Telugu
అన్నం ఆచితూచి వండటం మనలో చాలామందికి చేతకాదు. ఒకవేళ సరిగ్గా అంచనా వేసి సరిపోయేలా వండినా ఎవరో ఒకరు అసలే తినకపోవడమో కాస్తే తినడమో జరుగుతుంటుంది
TV9 Telugu
వస్తారనుకున్న అతిథులు రాకపోతే చెప్పాల్సిందే లేదు.. బోల్డంత అన్నం మిగిలిపోతుంది. కూరలైతే ఫ్రిజ్‌లో పెట్టి వేడిచేసుకు తినొచ్చు కానీ అన్నం అలా తినలేం
TV9 Telugu
పడేయాలంటే ఉసూరుమనిపిస్తుంది. అలా బాధపడే బదులు ఓ గిన్నెలో పెట్టేసి ఫ్రిజ్‌లో దాచేస్తాం. అన్నం తేలికపాటి ఆహారం. చలికాలమైనా, వేసవికాలమైనా ప్రతి సీజన్‌లో అన్నం ఇలా ఫ్రిజ్‌లో పెట్టడం మనలో చాలా మందికి అలవాటు
TV9 Telugu
అయితే ఇలా అన్నాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచాలో చాలా మందికి తెలియదు. దీంతో ఫ్రిజ్‌లో అన్నం బాగానే ఉందికదాని తినేస్తుంటాం. ఇలా చేయడం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
వండిన అన్నాన్ని 3 రోజుల వరకు మాత్రమే రిఫ్రిజిరేటర్‌లో ఉంచవచ్చు. తినడానికి ముందు రెండుసార్లకు మించి వేడి చేయకూడదు
TV9 Telugu
ఉడికించిన అన్నం గంటలోపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచకపోతే దానిపై బ్యాక్టీరియా చేరిపోతుంది. 24 గంటల కంటే ఎక్కువసేపు ఫ్రిజ్‌లో పెట్టకుండా వదిలేస్తే అది త్వరగా చెడిపోతుంది
TV9 Telugu
మిగిలిపోయిన అన్నం రిఫ్రిజిరేటర్‌లో ఉంచే ముందు అన్నం పూర్తిగా చల్లబరచాలి. వేడి వేడి అన్నాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల తేమ పెరుగుతుంది. దీని వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది
TV9 Telugu
అందుకే వండిన అన్నం 1-2 గంటలకు మించి బయట ఉంచవద్దు. ఫ్రిజ్‌లో ఎంత త్వరగా పెడితే అంత మంచిది. అలాగే వేడి చేసే ముందు, రిఫ్రిజిరేటర్‌లో నుంచి తీసిన వెంటనే తినేయాలి. అన్నాన్ని మళ్లీ వేడి చేసిన తర్వాత ఫ్రిజ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచకూడదు